సినిమా వార్తలు

‘మారెమ్మ’ ట్రైలర్‌.. మాధవ్‌పై శివ నిర్వాణ ప్రశంసలు!

Published by
Srinivas

మాస్ మహారాజా రవితేజ సోదరుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’. మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. సెప్టెంబర్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా హైదరాబాద్‌లో ‘మారెమ్మ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శకుడు శివ నిర్వాణ ఈ కార్యక్రమానికి హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ట్రైలర్‌ను డిజిటల్‌గా లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా శివ నిర్వాణ మాట్లాడుతూ.. సాధారణంగా డెబ్యూ హీరోలు తొలి సినిమాతో తమను తాము ప్రూవ్ చేసుకునేందుకు కమర్షియల్ కథలను ఎంచుకుంటారని, కానీ మాధవ్ మాత్రం కంటెంట్ బేస్డ్, ఇంటెన్స్ కథను ఎంచుకోవడం అభినందనీయమని అన్నారు. ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉందని, ఇందులోని ఇంటెన్సిటీ, మ్యూజిక్, ఫోటోగ్రఫీ బాగున్నాయని ప్రశంసించారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

హీరో మాధవ్ మాట్లాడుతూ.. రామ్ పోతినేని, శివ నిర్వాణతో పాటు మొత్తం చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఒక మనిషికి, దున్నపోతుకు మధ్య ఉండే అనుబంధం ఈ సినిమాలో ప్రత్యేకంగా కనిపిస్తుందని చెప్పారు. రవితేజ గారు సినిమా చూశారని, ముఖ్యంగా క్లైమాక్స్ ఆయనకు బాగా నచ్చిందని, సినిమా చూసి ఎమోషనల్ అయ్యారని మాధవ్ వెల్లడించారు.

దర్శకుడు నాగరాజు మాట్లాడుతూ.. ట్రైలర్ కంటే సినిమాలో పదిరెట్ల కంటెంట్ ఉంటుందని, ముఖ్యంగా చివరి 20 నిమిషాలు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటాయని తెలిపారు. తెలంగాణ పల్లెటూరి సంస్కృతి, అక్కడి జీవన విధానాన్ని సహజంగా చూపించామని చెప్పారు.

నిర్మాత మయూర్ రెడ్డి బండారు మాట్లాడుతూ.. ఇది పూర్తిగా తెలంగాణ పల్లెటూరి కథ అని, మాధవ్ తొలి సినిమాకే ఇలాంటి ఇంటెన్స్ కథను ఎంచుకోవడం సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు. నటుడు వికాస్ వశిష్ట కూడా ట్రైలర్ అదిరిపోయిందని, సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

మాధవ్, దీప జంటగా నటించిన ఈ చిత్రంలో వికాస్ వశిష్ట తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 10న ‘మారెమ్మ’ థియేటర్లలో సందడి చేయనుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts

  • ఓటిటి న్యూస్

‘పల్లబురుసు’.. ఓటీటీ స్ట్రీమింగ్!

సెప్టెంబర్ 3, 2026