సినిమా వార్తలు

విజయదశమికి ‘రణబాలి’.. విజయ్ దేవరకొండ, రష్మిక మూవీ రిలీజ్ డేట్ ఖరారు

Published by
Srinivas

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ‘టాక్సీ వాలా’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

టీ-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కుతోంది.

19వ శతాబ్దపు నేపథ్యంతో రూపొందుతున్న ‘రణబలి’ నిజ జీవిత చారిత్రక ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. బ్రిటిష్ వలస పాలన కాలంలో 1854 నుంచి 1878 మధ్య జరిగిన వాస్తవ సంఘటనలు కథకు కీలక ఆధారంగా నిలవనున్నాయి. దీంతో సినిమాలో చరిత్ర, యాక్షన్, ఎమోషన్‌కు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విజయదశమి పర్వదినాన్ని టార్గెట్ చేస్తూ రిలీజ్ డేట్‌ను లాక్ చేయడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్, ఫియర్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. చేతిలో కత్తి పట్టుకుని అత్యంత ఉగ్రంగా కనిపిస్తున్న ఆయన పాత్ర సినిమాపై మరిన్ని ప్రశ్నలు రేకెత్తిస్తోంది. పోస్టర్‌ను బట్టి చూస్తే యాక్షన్ ఎలిమెంట్స్‌కు సినిమాలో భారీ ప్రాధాన్యం ఉండనున్నట్లు అర్థమవుతోంది.

విజయదశమి కానుకగా ‘రణబలి’ రాబోతుండటంతో ఈ ఏడాది దసరా బాక్సాఫీస్ మరింత ఆసక్తికరంగా మారనుంది. విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న కాంబినేషన్, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం, చారిత్రక నేపథ్యం, భారీ నిర్మాణ విలువలు కలిసి సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పుతున్నాయి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.