భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందని నమ్మిన మహాత్ముడి కలలను నిజం చేస్తూ, ప్రతి పల్లెను ఒక స్వయం ప్రతిపత్తి గల శక్తి కేంద్రంగా మార్చే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌లో వేగవంతమైంది. ఏప్రిల్ 24, జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ సాధించిన అపూర్వ విజయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన 22 నెలల కాలంలో, నిర్వీర్యమైన వ్యవస్థలకు పునరుజ్జీవం పోసి, ఏపీని జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలబెట్టిన తీరు అమోఘం.
కేవలం నామమాత్రంగా సాగే గ్రామ సభలకు, ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ తన విభిన్నమైన ఆలోచనలతో పూర్వ వైభవం తీసుకువచ్చారు. తన ఆధ్వర్యంలో 2024 ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా, 13,326 గ్రామాల్లో ఏకకాలంలో గ్రామ సభలు నిర్వహించడం పౌర భాగస్వామ్యానికి పరాకాష్ట. దీని ద్వారా ‘వరల్డ్ రికార్డ్స్ యూనియన్’ గుర్తింపు లభించడమే కాకుండా, రూ.4,500 కోట్ల ఉపాధి హామీ పనులకు ప్రజల సమక్షంలోనే ఆమోదం తెలపడం పారదర్శక పాలనకు నిదర్శనం.
ఏ వ్యవస్థ అయినా విజయవంతం కావాలంటే పనిచేసే ఉద్యోగుల మనోధైర్యం ముఖ్యం. గతంలో నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యంత వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయించారు. సుమారు 10 వేల మందికి పైగా సిబ్బందికి పీడీఓల నుండి జెడ్పీ సీఈవోల వరకు పదోన్నతులు కల్పించడం ద్వారా పాలనా యంత్రాంగంలో నూతనోత్సాహం నింపారు.
వైద్య సేవలు అందక సామాన్య ప్రజల కష్టాలు చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, రవాణా సౌకర్యం లేని పల్లెలకు అభివృద్ధి ఫలాలు అందే లా, “అడవి తల్లి బాట” మరియు “పల్లె పండుగ” వంటి పథకాలతో రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేసింది. రూ.3,853 కోట్లతో వేల కిలోమీటర్ల సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా, గిరిజన ఆవాసాలను ప్రధాన స్రవంతితో కలిపేలా చేపట్టిన చర్యలు అనేక గ్రామాలను “డోలీ రహిత” గ్రామాలుగా మార్చాయి.
గ్రామీణ పారిశుధ్యంలో ఆంధ్రప్రదేశ్ ఒక విప్లవాన్ని సృష్టించింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చే ‘మ్యాజిక్ డ్రెయిన్ల’ ద్వారా 80 శాతం నిధులు ఆదా చేస్తూనే భూగర్భ జలాలను పెంపొందించడం ఒక గొప్ప ఆవిష్కరణ. 625 స్వచ్ఛ రథాల ద్వారా వ్యర్థాల నిర్వహణను ఆదాయ వనరుగా మార్చి, గ్రామాలను ఆర్థికంగా, ఆరోగ్యదాయకంగా తీర్చిదిద్దుతున్నారు.
ఉపాధి హామీ పథకాన్ని కేవలం కూలి పనులకే పరిమితం చేయకుండా, స్థిరమైన ఆస్తుల సృష్టికి ఉపయోగిస్తున్నారు. దానిలో భాగంగా 21,567 గోకులం షెడ్లు, పశువుల నీటి అవసరాలకు, వేల సంఖ్యలో నీటి తొట్టెలు మరియు ఫారం పాండ్స్ నిర్మించారు, ఫారం ఫాండ్స్ అంటే రైతులు తమ పొలంలో ఒక నిర్ణీత భాగంలో తవ్వుకునే చిన్నపాటి చెరువులు లేదా కుంటలనే ఫారం పాండ్స్ అంటారు. వీటి ప్రధాన ఉద్దేశ్యం వర్షపు నీటిని నిల్వ చేయడం. భూమిలోకి నీరు ఇంకి, చుట్టుపక్కల ఉన్న బోరు బావులలో నీటి మట్టం పెరుగుతుంది. దాని మూలంగా భూగర్భ జలాలు పెరిగి పాడి రైతులకు, సాగు రైతులకు నీటి సమస్య లేకుండా ఉంటుంది. ఇది గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పవన్ కళ్యాణ్ ప్రభుత్వ సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేస్తూ “స్వర్ణ పంచాయత్” పోర్టల్ మరియు ముఖ ఆధారిత గుర్తింపు (Facial Recognition) విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఉపాధి హామీ మస్టర్లలో ఎలాంటి అవకతవకలకు జరగకుండా అడ్డుకట్ట వేశారు. 13,350 పంచాయతీలను స్వతంత్ర పాలనా విభాగలుగా తీర్చిదిద్ది, 77 కొత్త డీడీఓ కార్యాలయాల ఏర్పాటుతో వికేంద్రీకరణను అక్షరాలా అమలు చేసి చూపారు. ఈ విషయం లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శ ప్రాయంగా నిలిచారు.
పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం RGSA ర్యాంకింగ్స్‌లో 24వ స్థానం నుండి మొదటి స్థానానికి చేరుకోవడం ఒక అద్భుతం. మహిళా స్నేహపూర్వక పంచాయతీ విభాగంలో తిరుపతి జిల్లాకు చెందిన “బొక్కసంపాళెం” గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. సుపరిపాలన (Good Governance) విభాగంలో విశాఖపట్నం జిల్లాలోని “శృంగవరం” గ్రామ పంచాయతీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
పేదరిక నిర్మూలన మరియు మెరుగైన జీవనోపాధి కి సంబంధించిన విభాగంలో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన “చెమ్ముళ్లపల్లి” గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం దక్కింది.
“స్వయం సమృద్ధి” మౌలిక సదుపాయాల విభాగంలో ప్రకాశం జిల్లాలోని “గుండమాల” గ్రామ పంచాయతీ తృతీయ స్థానాన్ని పొందింది. నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం, దీనిని మండలం స్థాయిలో అందిస్తారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు గాను చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలం జాతీయ స్థాయిలో మూడవ స్థానంలో నిలిచింది.
గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ , గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… సహాయ సహకారాలు తో… తన ఆధ్వర్యంలో ఉన్న పంచాయతీ శాఖ ను, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తనదైన ముద్రతో పల్లె సీమలను ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. “పల్లె ప్రగతే – దేశ ప్రగతి” అనే నినాదాన్ని నిజం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు పంచాయతీ రాజ్ వ్యవస్థలో దేశానికే వెలుగురేఖగా నిలుస్తోంది.
“పని సరిగ్గా చేయడం నైపుణ్యంతో కూడుకున్నది. ఇది మెదడు చేస్తుంది. సరైన పని ఎంచుకోవడం మనస్సు తో కూడుకున్నది”. నిజాయితీగా ఉండే నాయకుడు రెండోది చేస్తాడు. అతడే ఒక సైన్యం లాంటి “పవన్ కళ్యాణ్”.