2024లో నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన TeluguOne సంస్థ ఇప్పుడు తన రెండో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది.
రైతుల సమస్యలను ప్రధానాంశంగా తీసుకుని నిర్మించిన తొలి చిత్రం “రాజధాని ఫైల్స్” మంచి స్పందన అందుకుంది. ఆ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేయడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు అదే ఉత్సాహంతో రెండో ప్రాజెక్ట్‌ను మరింత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.
తెలుగువన్ అధినేత Ravishankar Kantamaneni తన పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌కు ఆయనే నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా తొలిసారి దర్శకత్వ బాధ్యతలను కూడా చేపడుతున్నారు.
పంచభూతాలను ప్రధాన కథా నేపథ్యంగా తీసుకుని, దాన్ని విస్తృత స్థాయిలో ఆవిష్కరిస్తూ ఒక భారీ కాన్సెప్ట్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా జరిగిన వేడుకలో పలువురు అతిథులు పాల్గొని రవిశంకర్ కంఠంనేనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. Ramesh కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, తెలుగువన్ ప్రొడక్షన్స్ రెండో చిత్రం ఘన విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
ఈ చిత్రానికి ప్రముఖ రచయిత Janardhana Maharshi కథ, రచన అందిస్తున్నారు. రచయితగా మాత్రమే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను నిరూపించుకున్న జనార్థన మహర్షి ఈ ప్రాజెక్ట్‌తో మరోసారి ఆసక్తిని పెంచుతున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని 2027 సమ్మర్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక బృందం మరియు ఇతర పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు రవిశంకర్ కంఠంనేని వెల్లడించారు.
తెలుగువన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రాన్ని కె. హిమబిందు సమర్పిస్తుండగా, వై. జతిన్ కుమార్ సహనిర్మాతగా వ్యవహరించనున్నారు.