నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర ఈ ఏడాది అత్యంత ఆసక్తికరమైన పాన్-ఇండియా రిలీజ్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఈ ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.
హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో రూపొందుతున్న ఈ చిత్రం గ్రాండ్ సినిమాటిక్ అనుభూతిని అందించబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ నేషనల్ వైడ్‌గా వైరల్ అయ్యి, సినిమాపై భారీ అంచనాలను పెంచింది.
ఈ రోజు మేకర్స్ సితారగా దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు. బ్యూటీఫుల్ అండ్ క్లాసిక్ లుక్‌తో ఆమె పోస్టర్ అదిరిపోయింది.
జీ స్టూడియోస్, ప్రెర్ణా అరోరా ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాను ఉమేష్ కుమార్ బన్సాల్, ప్రెర్ణా అరోరా నిర్మిస్తున్నారు. టాయిలెట్: ఎక్ ప్రేమ్ కథ, ప్యాడ్మాన్, పరి వంటి హిట్స్‌తో ప్రత్యేక ముద్ర వేసిన ప్రెర్ణా అరోరా, మళ్లీ ఒక హై-కాన్సెప్ట్ సినిమాను అందిస్తున్నారు.
క్రియేటివ్ డైరెక్షన్ – దివ్య విజయ్, సంగీతం – జీ మ్యూజిక్ కో. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉమేష్ కుమార్ బన్సాల్ స్ట్రాటజిక్ విజన్ తో పాటు శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుుణ అగర్వాల్, శిల్ప సింగాల్ నిర్మాణ బృందంగా, కో-ప్రొడ్యూసర్స్ అక్షయ్ కేజ్రివాల్, కుస్సుం అరోరా మద్దతు అందిస్తున్నారు.
విజనరీ టీమ్, జానర్ బౌండరీలు చెరిపేసే కాన్సెప్ట్‌తో, జటాధర భారత సినిమా చరిత్రలో తదుపరి మైథలాజికల్ ఎపిక్‌గా మారబోతుందని యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.