సినిమా వార్తలు

చిన్న సినిమాగా వచ్చి రూ.450 కోట్ల వసూళ్లు.. ఇప్పుడు మరో ఓటీటీలోకి ‘హనుమాన్ అంశ్’!

Published by
Srinivas

సినిమా విజయం సాధించాలంటే భారీ బడ్జెట్, స్టార్ హీరోలు ఉండాల్సిన అవసరం లేదని మరోసారి నిరూపించింది ‘హనుమాన్ అంశ్’. కేవలం రూ.2 కోట్లలోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ భక్తిరస చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.450 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా మరో ప్రముఖ ఓటీటీ వేదికపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

విశాల్ చతుర్వేది తెరకెక్కించిన ఈ చిత్రం ఆయన రచించిన ‘Divine Detour: That Changed My Life’ పుస్తకం ఆధారంగా రూపొందింది. ఆధ్యాత్మిక అంశాలతో పాటు భావోద్వేగాలను మేళవిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా, నీమ్ కరోలి బాబా జీవిత ప్రయాణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. తల్లి మరణం తర్వాత లక్ష్మీ నారాయణ జీవితంలో చోటుచేసుకున్న మార్పులు, ఆధ్యాత్మికత వైపు ఆయన వేసిన అడుగులు, చివరకు నీమ్ కరోలి బాబాగా మారిన తీరు కథలో కీలకంగా ఉంటాయి.

శోభినవ్ సత్యా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో చందన్ ఆనంద్, పూర్ణిమ తివారీ, అనిల్ రస్తోగి, విహాన్ షెడ్గే తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. విశాల్ చతుర్వేది రచన, దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా నిర్వహించారు.

థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ఈ చిత్రాన్ని సోనీలివ్ హిందీ వెర్షన్‌లో డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ సినిమాను తన ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకొస్తోంది. మరో రెండు రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రం ద్వారా మరింత మంది ప్రేక్షకులకు చేరువ కావాలని మేకర్స్ భావిస్తున్నారు.

స్వంభు మీడియా నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, విశాల్ చతుర్వేది నిర్మాణ సంస్థ హోలీ కౌ హోమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్రస్తుతం సిద్ధమవుతోంది. తొలి భాగం సాధించిన సంచలన విజయంతో రెండో భాగంపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts