సినిమా వార్తలు

‘మన శంకర వర ప్రసాద్‌ గారు’… ఫస్ట్‌డే ఫస్ట్‌షో టికెట్ రూ. లక్షా 11 వేలు…

Published by
Srinivas

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ పై అంచనాలు పీక్స్‌కు చేరాయి. సినిమా విడుదలకు ముందే మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఫస్ట్‌డే–ఫస్ట్‌షో టికెట్ల కోసం అభిమానులు వేలాల్లో పాల్గొంటూ లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు.

అమలాపురంలో తొలి టికెట్‌ను వేలంలో రూ. లక్షా 11 వేలుకు ఓ బీజేపీ నాయకుడు దక్కించుకున్నారు. అదే విధంగా నరసాపురంలోని అన్నపూర్ణ థియేటర్‌లో ఫస్ట్‌డే ఫస్ట్‌షో టికెట్‌ రూ. లక్షా రెండు వేలు పలకడం విశేషం. ఈ ఘటనలు అభిమానుల క్రేజ్‌ను మరోసారి చాటుతున్నాయి.

వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌కు విరాళంగా అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించడంతో ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యం దక్కింది. అభిమానుల ఉత్సాహం సేవా కార్యక్రమాలతో ముడిపడటం ప్రశంసలు అందుకుంటోంది.

ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ సినిమాపై ఇప్పటికే భారీ బజ్‌ నెలకొంది. విడుదలకు ముందే టికెట్లకు లక్షల బిడ్‌లు పడటం, మెగాస్టార్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపిస్తోంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.