మెగాస్టార్ Chiranjeevi నటించిన సంక్రాంతి చిత్రం ‘Mana Shankara Varaprasad Garu’ బాక్సాఫీస్ వద్ద దూకుడు తగ్గకుండా దూసుకెళ్తోంది. గట్టి పోటీ మధ్య విడుదలైనప్పటికీ, కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఈ సంక్రాంతికి స్పష్టమైన విజేతగా నిలిచింది. దర్శకుడు Anil Ravipudi మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చిరంజీవి స్టార్ పవర్ జోడవడంతో వసూళ్ల వర్షం కురుస్తోంది.
ఇప్పటికే ఐదో రోజున తెలుగు రాష్ట్రాల్లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డ్‌ను నమోదు చేసిన ఈ చిత్రం, RRR రికార్డును అధిగమించి ట్రేడ్‌ను ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఏడో రోజున మరోసారి బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసింది. తెలుగు రాష్ట్రాల్లో ఏడో రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉన్న Ala Vaikunthapurramulo రికార్డును సైతం భారీ తేడాతో దాటేసి కొత్త మార్క్‌ను నెలకొల్పింది.
సాధారణంగా సంక్రాంతి సీజన్ చివరి రోజున కలెక్షన్లు తగ్గడం సహజం. పండుగ సెలవులు ముగియడంతో ప్రేక్షకులు థియేటర్లకు దూరమవుతారు. అయితే ‘మన శంకర వరప్రసాద్ గారు’ మాత్రం ఈ ట్రెండ్‌ను పూర్తిగా బ్రేక్ చేసింది. సంక్రాంతి ముగింపు రోజునే తెలుగు రాష్ట్రాల్లో ఆల్‌టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసి, మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినా మరోసారి రుజువైంది.
ప్రస్తుతం సినిమా అన్ని ప్రాంతాల్లో లాభాల జోన్‌లోకి ప్రవేశించింది. ఇంకా ఎంతవరకు దూసుకెళ్తుందన్నది ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తంగా, ఈ సంక్రాంతికి చిరంజీవి పేరు మరోసారి బాక్సాఫీస్ చరిత్రలో ఘనంగా నమోదైంది.