వార్తలు

యుద్ధం ఆపేదెలా… అయోమయంలో అమెరికా…

Published by
Suresh Thota

“రోట్లో తల పెట్టి రోకటి పోటుకు వెరవ వచ్చునా” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి అలా ఉంది. యుద్ధాన్ని ఎలా ముగించాలా….అమెరికా ముందున్న బిలియన్ డాలర్ల ప్రశ్న…..? అమెరికా లో జనం నుండి పెరుగుతున్న ఒత్తిడి నేపద్యంలో ట్రంప్ ఆలోచన..

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న అమెరికా మరియు ఇరాన్ యుద్ధం ప్రపంచ రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని త్వరగా ముగించాలా అనే అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నారని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, ప్రజల అసంతృప్తి, రాజకీయ ఒత్తిడి కారణంగా ఈ చర్చలు ప్రారంభమైనట్టు సమాచారం.

“యుద్ధం త్వరలో ముగుస్తుంది” ట్రంప్ వ్యాఖ్యలు…. ఇరాన్‌ పై జరుగుతున్న అమెరికా ,ఇజ్రాయెల్ దాడుల తర్వాత, ఈ యుద్ధం ఎక్కువకాలం కొనసాగదని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిందని, యుద్ధం చాలా త్వరలో ముగిసే అవకాశం ఉంది అని ఆయన చెప్పారు. కాని అందుకు భిన్నంగా పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే మరోవైపు ఆయన స్పష్టమైన ముగింపు గడువు ప్రకటించలేదు. అమెరికా ఇంకా ఇరాన్ డ్రోన్ కేంద్రాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై దాడులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

అమెరికాలో ప్రజల నుంచి ఒత్తిడి ప్రారంభం అయింది ట్రంప్ ప్రభుత్వానికి, అమెరికా ప్రజల్లో ఈ యుద్ధంపై అసంతృప్తి పెరుగుతోందని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఎందుకు చేస్తున్నారు యుద్ధం అని ప్రజలు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఈ యుద్ధం వల్ల అమెరికా కలుగుతున్న లాభం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. అమెరికన్లలో మెజారిటీ ప్రజలు ఇరాన్‌పై సైనిక చర్యకు వ్యతిరేకంగా ఉన్నారు అని నివేదికలు తెలుపుతున్నాయి.

పెరుగుతున్న పెట్రోల్ ధరలు ప్రజల ఆగ్రహానికి దారి తీస్తున్నాయి. ట్రంప్ రాజకీయ మద్దతుదారులలో కూడా యుద్ధంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో యుద్ధాన్ని ఎలా ముగించాలి అనే విషయంపై ట్రంప్ సలహాదారులు కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పుడు యుద్ధం ఆపేస్తే ఇరాన్ తాను గెలిచినట్లుగా ప్రకటించుకుంటుంది. పోనీ కొనసాగిస్తే ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది. ఇప్పటికే పాకిస్తాన్ లో ఆయిల్ నిల్వలు నిండుకోవడం తో వర్క్ ఫ్రమ్ హోమ్ ను ప్రకటించింది అని వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ పరిస్థితి అయోమయం లో ఉండి భారత ను ఆయిల్ కోసం అర్ధిస్తుంది.

ఇజ్రాయెల్ తన సుస్థిరత కోసం యుద్ధం చేస్తుంది. తెలివిగా అమెరికా ని లాగింది యుద్ధంలోకి, తన ప్రయత్నం నెరవేరింది. కాని అమెరికా బయటకు రాలేని విధంగా ఉంది, దీనికి పర్యవసానంగా అమెరికా ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తుంది అని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.

యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రపంచ చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికాలో పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ప్రజల జీవన వ్యయం కూడా పెరిగింది. ఇంకొక విషయం ఏమిటంటే యుద్ధం తరువాత చమురు ధరలు ఇప్పుడు ఉన్న రేటు కాస్త తగ్గుతుంది ఏమో గాని, మరల 60 డాలర్ల కు వచ్చే అవకాశం లేదు అని ఆయిల్ మార్కెట్ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అంటే ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఆర్థిక మాంద్యం లోకి జారిపోయే అవకాశాలు కనపడుతున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముగింపు….

“రాజుగారి అబ్బాయి ఏడుస్తున్నాడని …. ఎత్తుకున్న తప్పే…. ఎత్తుకోకపోయినా తప్పే”…. అలా ఉంది అమెరికా పరిస్థితి…. యుద్ధం ఆపితే ఒకలా…. ఆపకపోతే ఇంకోలా తలపోటు…..

Suresh Thota

Recent Posts