పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “ది రాజా సాబ్” విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ సాంగ్, ట్రైలర్, టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక మిగిలిన పాటలు, పెద్ద ప్రీ-రిలీజ్ ఈవెంట్ మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఈ చిత్రం జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. అమెరికాలో ఒక రోజు ముందుగానే, అంటే జనవరి 8న, భారీ ఎత్తున ప్రీమియర్ షోలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రీమియర్స్ ద్వారా సుమారు 10 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించేలా డిస్ట్రిబ్యూటర్లు పెద్ద ప్లానింగ్ చేశారు.
ఇందులో విశేషం ఏంటంటే… అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేసిన పోస్టర్‌లో సినిమా నిడివి 3 గంటలు 15 నిమిషాలు అని ప్రత్యేకంగా పేర్కొనడం. ఇటీవలి కాలంలో మూడు గంటలకు పైగా ఉన్న పుష్ప 2, యానిమల్ వంటి సినిమాలు హిట్ సాధించిన నేపథ్యంలో, “ది రాజా సాబ్”కు కూడా ఇది పెద్ద ఇష్యూ కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అయితే దర్శకుడు మారుతి ఇంతవరకు అలాంటి లాంగ్ రన్‌టైమ్‌తో సినిమాలు చేయకపోవడం ఒక సవాల్‌గా మారొచ్చు. ముఖ్యంగా ఈ జానర్‌కు ఎక్కువ నిడివి ఉంటే ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారన్న అభిప్రాయాలు ఉన్నాయి.
అయితే, చివరికి సినిమా యొక్క అసలు రన్‌టైమ్ ఏమిటన్నది సెన్సార్ పూర్తి అయిన తర్వాత మాత్రమే స్పష్టంగా తెలుస్తుంది.