సినిమా వార్తలు

‘కూలీ’ ట్రైలర్: గూస్‌బంప్స్… అడుగు పెడితే విజలు మోగులే

Published by
Srinivas

సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కూలీ’ ట్రైలర్ వచ్చేసింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ పాన్-ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇప్పటికే టీజర్స్, సాంగ్స్‌తో హైప్ క్రియేట్ చేసి, ఈ ట్రైలర్‌తో అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లింది.

“ఒకడు పుట్టగానే వాడు ఎవడి చేతిలో చావాలో తలమీద రాసిపెట్టి ఉంటుంది” అనే నాగార్జున పవర్‌ఫుల్ డైలాగ్‌తో స్టార్ట్ అయిన ట్రైలర్ ఒక్కసారిగా గూస్‌బంప్స్ తెప్పించింది. రీసెంట్‌గా కుబేరతో బ్లాక్‌బస్టర్ అందుకున్న నాగార్జున స్టైలిష్ ఇంకా మెనసింగ్ లుక్లో కనిపించడం ఫ్యాన్స్‌కి మేజర్ సర్‌ప్రైజ్. ఇది ఆయన కెరీర్‌లోనే మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్స్‌లో ఒకటిగా అనిపిస్తోంది.

రజనీకాంత్ ఎంట్రీ మాత్రం మరో లెవెల్. “అడుగు పెడితే విజలు మోగులే” అనే మాస్ బీజీఎంతో ఆయన దేవా పాత్రలో వచ్చిన స్వాగ్ ఆడియన్స్‌ని స్క్రీన్‌కి కట్టిపడేసింది. డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు పూర్తిగా మాస్ ఫీస్ట్.

అమీర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ పాత్రల గ్లింప్స్ కూడా ట్రైలర్‌కి అదనపు క్రేజ్ తెచ్చాయి.

లోకేష్ కనగరాజ్ కూలీ కోసం చేసిన వరల్డ్ బిల్డింగ్ అద్భుతం. ప్రతి ఫ్రేమ్ LCU (Lokesh Cinematic Universe)ని మరో స్థాయికి తీసుకెళ్లింది. అనిరుధ్ మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ – గూస్‌బంప్స్ గ్యారెంటీ. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ విజువల్స్‌కి గ్రాండియర్ ఫీలింగ్ ఇచ్చింది.

సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రొడక్షన్ విలువలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో ఉన్నాయి. ట్రైలర్ ప్రతి షాట్‌లో ఆ లావిష్‌నెస్ కనిపిస్తోంది.

డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఏషియన్ మల్టీప్లెక్సెస్ తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకుని గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమయ్యారు.

ఈ ట్రైలర్ మాస్, యాక్షన్, స్టైల్ మిక్స్‌తో సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. రజినీ – నాగార్జున కాంబినేషన్ మరియు లోకేష్ మేకింగ్ కలయికతో కూలీ పక్కా బాక్స్ ఆఫీస్ ఫైర్‌వర్క్స్ పేల్చబోతోందన్న నమ్మకాన్ని ఇచ్చింది.

కూలీ 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts