సినిమా వార్తలు

‘సంబరాల యేటిగట్టు (SYG)’ గ్లింప్స్: “అసుర సంధ్య వేళ మొదలైంది…”

Published by
Srinivas

‘సంబరాల యేటిగట్టు (SYG)’ నుంచి గ్లింప్స్‌ను విడుదల అయ్యింది. మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ పుట్టినరోజు (అక్టోబర్ 15) సందర్భంగా ‘అసుర ఆగమన’ పేరుతో విడుదలైన ఈ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా సంచలనంగా మారింది.

దాదాపు ₹125 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రం సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాగా నిలవనుంది. ఈ గ్లింప్స్ ద్వారా చూపించిన సింహాసనం, యోధులు, యుద్ధరంగం, వాతావరణం, సౌండ్ డిజైన్‌లు అన్నీ కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాయి. తేజ్ చివర్లో చెప్పిన “అసుర సంధ్య వేళ మొదలైంది” అనే డైలాగ్‌తో గ్లింప్స్ ముగుస్తూ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి రేపుతోంది.

సాయి దుర్గ తేజ్ లుక్‌ అయితే పూర్తిగా కొత్తగా ఉంది. కండలు తిరిగిన బాడీ, ఇంటెన్స్ లుక్‌, యోధుడిలా కనిపించే శైలి – తేజ్ ఈ పాత్ర కోసం ఎంతగా శ్రమించాడో చూపిస్తోంది. ఆయన శరీరాకృతిలో మార్పు తెచ్చుకునేందుకు చేసిన కఠినమైన వర్కౌట్‌, డైట్‌ ఫాలోయింగ్‌ గ్లింప్స్‌లోనే స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క “అసుర ఆగమన” గ్లింప్స్‌తోనే తేజ్ నేషనల్ వైడ్ హడావుడి సృష్టించాడు.

విజువల్స్, యాక్షన్, బీజీఎం — అన్నీ పాన్ ఇండియా స్టాండర్డ్స్‌కి తగిన రేంజ్‌లో ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ వెట్రివేల్ పళనిసామి కెమెరా పనితనం దృశ్యాలను మరింత గంభీరంగా, ఘనంగా చూపిస్తుంది. యాక్షన్ కొరియోగ్రఫీ మరింత ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.

మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అయితే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఎడిటర్ నవీన్ విజయకృష్ణ, ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్ తమ విభాగాల్లో ప్రాణం పెట్టి పని చేస్తున్నారని ఈ గ్లింప్స్ స్పష్టంగా చెబుతోంది.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తున్నారు. గ్లింప్స్ విడుదలైన క్షణం నుంచి సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.

ఈ గ్లింప్స్ చూస్తే ‘సంబరాల యేటిగట్టు (SYG)’ ఒక భారీ యాక్షన్‌, ఎమోషనల్‌, పీరియాడిక్ డ్రామాగా ఉండబోతుందని అర్థమవుతోంది. విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.