చార్మింగ్ స్టార్ Sharwanand మోస్ట్ ఎవైటెడ్ మూవీ బైకర్ కోసం అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నారు. వ్యక్తిగతంగా, క్రియేటివ్‌గా తనను మళ్లీ ఛాలెంజ్ చేసే పాత్రగా బైకర్ నిలిచింది. ఇందులో శర్వా 18 ఏళ్ల రేసర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన తన శరీరాన్ని మాత్రమే కాదు, మనసును కూడా పూర్తిగా మార్చుకున్నారు.
ఈ చిత్రానికి Abhilash Reddy దర్శకత్వం వహించగా, UV Creations నిర్మిస్తోంది. సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన శర్వా ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియోకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఒకసారి కమిట్ అయిన తర్వాత శర్వా పూర్తిగా తనను డెడికేట్ చేసుకున్నారు. ఉదయం సూర్యోదయం కంటే ముందే మొదలయ్యే రోజు, అలసటతో ముగిసేది. లాంగ్ డిస్టెన్స్ పరుగులు, కఠినమైన స్ట్రెంగ్త్ ట్రైనింగ్, మొబిలిటీ సెషన్స్‌తో ఆయన తన పరిమితులను దాటారు. ఇది కేవలం శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా పెద్ద పరీక్షగా మారింది.
ఈ ప్రయాణంలో యోగా కీలక పాత్ర పోషించింది. జిమ్ వర్కౌట్స్ ఆయనకు బలం, సహనాన్ని ఇచ్చినప్పుడు, యోగా ఆయన ఆలోచనలను ప్రశాంతం చేసి ఫోకస్‌ను పెంచింది. ఈ ఫెరోసిటీ, ప్రశాంతత కలయికే ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్‌కు ప్రధాన బలం అయింది. దీంతో శర్వా బరువు తగ్గి, మరింత షార్ప్ లుక్‌తో పాటు కొత్త కాన్ఫిడెన్స్‌ను పొందారు.
బైకర్ విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ, శర్వా కొత్త అవతార్‌కి భారీగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
శర్వా మాట్లాడుతూ… “షూటింగ్ మొదటి రోజు అద్దంలో చూసుకున్నప్పుడు, నేను సిద్ధంగా ఉన్న, క్రమశిక్షణతో ఉన్న వ్యక్తిని చూశాను. ఈ ప్రయాణం నాకు ఒక విషయం నేర్పింది… ఎంత నిరాశలో ఉన్నా, ఒక నిర్ణయం తీసుకుంటే పూర్తిగా మారిపోవచ్చు. ఏప్రిల్ 3న మీరు స్క్రీన్‌పై విక్కీని చూస్తే, అది కేవలం నటన కాదు – రెండు సంవత్సరాల కష్టం, మారాలనే పట్టుదల ఫలితం” అని అన్నారు.