నితిన్, అందాల భామ శ్రీలీల జంటగా నటించిన ‘రోబిన్‌హుడ్’ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం మార్చి 29 విడుదల కానుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే, చిత్ర నిడివిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు, ఈ సినిమాకు టికెట్ ధర పెంపు అనుమతి లభించడంతో, ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే సినిమా ప్రమోషన్లు భారీ స్థాయిలో చేస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, దేవదత్త నాగే, వెన్నెల కిశోర్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రత్యేకంగా, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ లో కనిపించనున్నాడు, ఇది ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్ కానుంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకున్నాయి. కామెడీ, యాక్షన్, మాస్ ఎంటర్టైన్‌మెంట్ తో ‘రోబిన్‌హుడ్’ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి!