విజయ్ దేవరకొండ నటించిన పాన్-ఇండియా యాక్షన్ డ్రామా కింగ్‌డమ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ ఒక కొత్త, పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించబోతుండడంతో అంచనాలు మరింత పెరిగాయి.
తాజా సమాచారం ప్రకారం, కింగ్‌డమ్ సెన్సార్ పనులు పూర్తి చేసుకుని UA సర్టిఫికేట్ పొందింది. దీంతో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యి, ఈ చిత్రం జూలై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైంది.
ఇకపోతే, మేకర్స్ విజయ్ దేవరకొండను ఓ కొత్త, యాంగ్రీ లుక్‌లో చూపించిన కొత్త పోస్టర్‌ని విడుదల చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేశారు.
ఈ చిత్రంలో భాగ్యశ్రీ బొరుసే హీరోయిన్‌గా నటించగా, నాగ వంశీ మరియు సాయి సౌజన్య నిర్మాణం వహించారు. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ సమకూర్చగా, ఆయన అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఇకపోతే, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ కూడా త్వరలోనే విడుదల కానుంది.
విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి – అనిరుధ్ కాంబినేషన్‌లో వస్తున్న కింగ్‌డమ్, ఈ జూలైలో ప్రేక్షకులను ఆకట్టుకునే గ్రాండ్ విజువల్ ఎంటర్‌టైనర్‌గా రానుంది.