మల్టీ-టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న పీరియడ్ థ్రిల్లర్ కాంతపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఇప్పటికే స్ట్రాంగ్ బజ్ సృష్టించిన ఈ చిత్రం, తాజాగా విడుదలైన టీజర్‌తో మరింత హైప్ క్రియేట్ చేసింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం 1950ల మద్రాస్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ డ్రామాగా రాబోతోంది.
స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సముద్రఖని కీలక పాత్రలో నటిస్తుండగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది.
దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ కథా గాఢతను, పాత్రల మధ్య ఉన్న భావోద్వేగాల తాకిడిని మరింత హైలైట్ చేస్తూ సినిమాపై అంచనాలను పెంచింది. కథలో చంద్రన్ అనే వెర్సటైల్ యాక్టర్, వెటరన్ రైటర్-డైరెక్టర్ అయ్య మధ్య ఉన్న బలమైన అనుబంధం, క్రమంగా స్టార్‌డమ్‌తో వచ్చే విభేదాలతో చీలిపోవడం చూపిస్తారు. అయ్య శక్తివంతమైన మహిళా పాత్ర చుట్టూ తన తొలి హర్రర్ చిత్రాన్ని రూపొందిస్తే, స్టార్ అయిన చంద్రన్ తన ఇమేజ్‌కి తగ్గట్టుగా స్క్రిప్ట్‌ను మార్చి టైటిల్‌ను కూడా కాంతగా మార్చేస్తాడు.
1950ల మద్రాస్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకెళ్లేలా అద్భుతమైన సెట్స్, కాస్ట్యూమ్స్‌తో ఆకట్టుకోబోతోంది.
దుల్కర్ సల్మాన్ తన కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మంత్రముగ్ధులను చేస్తే, సముద్రఖని వెటరన్ ఫిల్మ్ మేకర్ పాత్రలో ఒదిగిపోయారు. భాగ్యశ్రీ బోర్సే తనదైన ముద్ర వేసింది.
టెక్నికల్ విభాగంలో డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ 1950ల వాతావరణాన్ని అద్భుతంగా రీక్రియేట్ చేస్తే, తా. రామలింగం ఆర్ట్ డైరెక్షన్ విజువల్ గ్రాండియర్‌ని పెంచింది. ఝాను చంథర్ సంగీతం కథా ఇంటెన్సిటీని మరింత ఎలివేట్ చేయగా, తమిళ్ ప్రభ అదనపు స్క్రీన్‌ప్లే అందించారు. లెవెలిన్ ఆంథోనీ గోన్సాల్వ్స్ ఎడిటింగ్ సినిమాను ఎంగేజింగ్‌గా మలిచింది.
టీజర్‌తో భారీ అంచనాలు పెంచిన కాంత సెప్టెంబర్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.