ఓటిటి న్యూస్

‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

Published by
Srinivas

హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. బాబు డెగాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చవాన్, శ్రీధర్ చెని, దీపక్ ముస్త్యాల నిర్మించారు. రాజ్ సుహాస్, ప్రమదేశ్వి వి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు.

థియేట్రికల్ రన్ అనంతరం ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ETV Winలో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 18 నుంచి ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ETV Winలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన లాంచింగ్ పోస్టర్‌ను స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఆవిష్కరించారు.

ఈ చిత్రంలో హర్ష చెముడుతో పాటు హైపర్ ఆది, జీవన్ కుమార్, ఐశ్వర్య హోలక్కల్, శ్రావ్య చౌదరి, శ్రీ విద్యా, మహేందర్, ప్రేమ్ సాగర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పెళ్లి, బ్యాచిలర్ లైఫ్ చుట్టూ సాగే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం వినోదాత్మక అంశాలతో ప్రేక్షకులను అలరించనుంది.

‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రానికి అజయ్ అరసాడ సంగీతం అందించగా, శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. జానీ షేక్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, లిఖిత్ లీ ఎడిటర్‌గా, సాయి ప్రావలిక కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. పీవీజీ విశ్వనాథ్ లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.

మరి థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి. సెప్టెంబర్ 18 నుంచి ETV Winలో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ స్ట్రీమింగ్ కానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts