సినిమా వార్తలు

‘స్లమ్ డాగ్’లో టబు పాత్ర ఇదే.. గ్లింప్స్‌తో పూరి జగన్నాథ్ అదిరిపోయే హింట్

Published by
Srinivas

పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోలే కాదు.. పవర్‌ఫుల్ క్యారెక్టర్లు కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’లో టబు పోషిస్తున్న గౌరి హెగ్డే పాత్ర కూడా అదే తరహాలో ఉండబోతున్నట్లు తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ తొలిసారి కలిసి చేస్తున్న ఈ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్‌తో ఆసక్తిని పెంచింది. తాజాగా టబు పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేయడంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది.

గ్లింప్స్ ప్రారంభంలోనే స్లమ్ ఏరియా రఫ్ అండ్ గ్రిటీ వాతావరణాన్ని చూపించారు. ఆ తర్వాత కారు దిగుతూ సిగరెట్ వెలిగించే టబు ఎంట్రీ అదిరిపోయింది. గౌరి హెగ్డేగా ఆమె స్క్రీన్‌పై కనిపించిన తీరు చూస్తే.. ఈ పాత్ర సినిమాలో ఎంత కీలకంగా ఉండబోతోందో అర్థమవుతోంది.

ఓ స్థానిక గూండాకు వార్నింగ్ ఇవ్వడం.. వెంటనే చెంపదెబ్బ కొట్టడం.. ఆ తర్వాత లాఠీ పట్టుకుని గూండాలను చితక్కొట్టడం.. ఇలా గ్లింప్స్ మొత్తం టబు పాత్ర చుట్టూనే తిరుగుతుంది. భయపడటం తెలియని, ఎవరి మాటా వినని, అవసరమైతే ఎంత దూరమైనా వెళ్లే పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా ఆమె పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

‘One Fearless Woman’, ‘Powerful Officer’, ‘Ruthless’, ‘Merciless’, ‘Devil In The Department’ అంటూ గ్లింప్స్‌లో ఇచ్చిన క్యారెక్టర్ ట్యాగ్స్ టబు పాత్రపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. చివర్లో “గౌరి హెగ్డే.. డిప్యూటీ కమిషనర్, ఇన్‌కమ్ ట్యాక్స్” అంటూ టబు చెప్పే డైలాగ్ ఆమె పాత్రను మరింత ఎలివేట్ చేసింది.

ఇక గ్లింప్స్‌లో విజయ్ సేతుపతికి సంబంధించిన కొన్ని షాట్లు కూడా కనిపించాయి. ఆయన పాత్రను మాత్రం పూర్తిగా రివీల్ చేయకుండా మేకర్స్ సస్పెన్స్ కొనసాగించారు. టబు పాత్ర, విజయ్ సేతుపతి పాత్రల మధ్య సంబంధం ఏంటి? ఈ స్లమ్ బ్యాక్‌డ్రాప్‌లో అసలు కథ ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారింది.

పూరి జగన్నాథ్ సినిమాల్లో కనిపించే రా నేచర్, మాస్ ఎలివేషన్ ఈ గ్లింప్స్‌లో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా టబు లుక్, బాడీ లాంగ్వేజ్ సినిమాకు కొత్త ఎనర్జీని తీసుకొచ్చాయి.

ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా, దునియా విజయ్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, సంతోష్ నూజిల్లా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ తమ పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై జేబీ మోషన్ పిక్చర్స్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా నుంచి టబు గ్లింప్స్ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts