ఆంధ్ర ప్రదేశ్

డీఎస్సీపై ‘సాక్షి’ ప్రచారానికి రామకృష్ణ కౌంటర్..

Published by
Rahul N

డీఎస్సీ నియామకాలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. తనను అడ్డం పెట్టుకుని ‘సాక్షి’లో తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ రామకృష్ణ అనే అభ్యర్థి పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు.

రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తాను డీఎస్సీలో క్వాలిఫై కాలేదని, ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నానని పేర్కొన్నారు. డీఎస్సీలో అర్హత సాధించకపోయినా తనకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వచ్చిందంటూ ‘సాక్షి’లో ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవమని ఆయన ఖండించారు.

తన వ్యక్తిగత పరిస్థితులను ప్రస్తావిస్తూ తనపై నిందలు వేస్తూ వార్తలు ప్రసారం చేయడంపై రామకృష్ణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవాలను తెలుసుకోకుండా తన పేరును రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోవడం సరికాదని అన్నారు. తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధంగా అని, అదే సమయంలో తాను చెప్పింది అబద్ధమని నిరూపించే ఆధారాలను చూపాలని సవాల్ చేశారు.

డీఎస్సీ విషయంలో వేలాది మంది అభ్యర్థుల ఆత్మగౌరవంతో ఆడుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు కూడా రామకృష్ణ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం అభ్యర్థుల పేర్లు, వారి పరిస్థితులను ఉపయోగించుకోవడం సరికాదని పేర్కొన్నారు.

తనపై వచ్చిన ప్రచారంపై నేరుగా స్పందించిన రామకృష్ణ.. “డీఎస్సీ విషయంలో వాస్తవాలు ఏంటో నిరూపించండి. నా విషయంలో చేసిన ప్రచారం నిజమని నిరూపించగలరా?” అంటూ ఆరోపణలు చేసిన వారిని ప్రశ్నించారు.

డీఎస్సీ వ్యవహారం ఇప్పటికే రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో రామకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Rahul N

Recent Posts