ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న ఆసక్తికరమైన తెలంగాణ ఫ్యామిలీ డ్రామా ‘ఇడుపు కాయితం’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలిసి తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నాగదుర్గ ఈ సినిమాలో ప్రియదర్శికి జోడీగా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ఎంటర్‌టైనింగ్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కుతోంది.
ఇక ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ క్రేజీ మ్యూజికల్ అప్డేట్ ఇచ్చారు. ‘శ్రీలత..’ పాట పూర్తి వెర్షన్‌ను ఈ నెల 11న లిరికల్ సాంగ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇటీవల ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా ఈ పాట ప్రోమోను విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. విడుదలైన కొద్దిసేపటికే ప్రోమో వైరల్‌గా మారడంతో పాటు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంది.
పాట పూర్తి వెర్షన్ ఎప్పుడు వస్తుందంటూ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా మేకర్స్‌ను ప్రశ్నిస్తూ వచ్చారు. ముఖ్యంగా నాగదుర్గకు తెలంగాణ ఫోక్ మ్యూజిక్ లవర్స్‌లో ఉన్న క్రేజ్ కూడా ‘శ్రీలత..’ పాటపై ఆసక్తిని మరింత పెంచింది. దీంతో ప్రేక్షకుల నుంచి వస్తున్న డిమాండ్‌కు స్పందించిన చిత్రబృందం ఈ నెల 11న ఫుల్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది.
మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి ఈ పాటను మంచి మెలోడీ ట్యూన్‌తో అందంగా కంపోజ్ చేసినట్లు చిత్రబృందం తెలిపింది. ఇప్పటికే ప్రోమోతో ఆకట్టుకున్న ‘శ్రీలత..’ పూర్తి పాట ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
ప్రస్తుతం ‘ఇడుపు కాయితం’ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమాను డిసెంబర్ మొదటి వారంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.