ఆంధ్ర ప్రదేశ్

మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం

Published by
Rahul N

కొన్నాళ్ల క్రితం విట్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువతకు కలలు సాకారం చేసుకునే వేదికగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్థాపన చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వాగ్దానాన్ని నేడు నెరవేర్చుతూ, మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ లో ఈ ఇన్నోవేషన్ హబ్‌ను ఘనంగా ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవంలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, నాదెండ్ల మనోహర్, టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

రతన్ టాటా ఆలోచనలకు అంకితం

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… “రతన్ టాటా భరత జాతి ముద్దుబిడ్డ. ఆయన సంపాదించిన డబ్బును సమాజానికి తిరిగి ఇచ్చిన మహనీయుడు. ఈ ఇన్నోవేషన్ హబ్‍ను రతన్‍టాటా గారికి అంకితమిస్తున్నాం.రతన్ టాటా ఆలోచనలను సజీవంగా ఉంచే ప్రయత్నమే ఈ ఇన్నోవేషన్ హబ్. యువత మైండ్‌సెట్ మారాలి. ‘నా వల్ల కాదు’ అనేది మనసులోంచి తీసేయాలి. మీరు ఏదైనా సాధించగలరు. మీ కోసమే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను తీసుకొచ్చాం.” అని అన్నారు

యువత కోసం వేదిక

ఈ ఇన్నోవేషన్ హబ్ ద్వారా విద్యార్థులు, స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తలకు అవసరమైన మొత్తం ఎకో సిస్టం ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు.

“ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త బయటకు రావాలనే లక్ష్యంతో ఈ ఇన్నోవేషన్ హబ్‌లు పనిచేస్తాయి” అని సీఎం స్పష్టం చేశారు.

“సమస్యను చూసి భయపడితే బలహీనమవుతాం. సమస్య పరిష్కారానికి ఆలోచిస్తే విజయం మనదే” అని యువతకు ప్రేరణనిచ్చారు.

Rahul N

Recent Posts