ఇంటర్వ్యూలు

‘విష్ణు విన్యాసం’తో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ: శ్రీవిష్ణు

Published by
Srinivas

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న Sree Vishnu తన తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’తో మరోసారి నవ్వుల జల్లు కురిపించేందుకు సిద్ధమయ్యారు. దర్శకుడు Yadunath Maruthi Rao తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మిస్తున్నారు. నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

విడుదల సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీవిష్ణు సినిమా విశేషాలను పంచుకున్నారు.

గ్రహాలు, జాతకాలు నమ్ముతారా?

“అన్నీ ఫాలో అవ్వను. కానీ చిన్నప్పటి నుంచి అలవాటైన కొన్ని విషయాలు పాటిస్తాను. టైమ్, నెంబర్లు వంటి ప్రత్యేక నమ్మకాలు మాత్రం లేవు,” అని స్పష్టం చేశారు.

ప్రాజెక్ట్ ఎలా ప్రారంభమైంది?

“డైరెక్టర్ మారుతి కథ చెప్పగానే నచ్చింది. అందరూ రిలేట్ అయ్యే కథ. ఫ్యామిలీతో కలిసి నవ్వుకునే సినిమా. వెంటనే ఓకే చెప్పాం,” అని తెలిపారు.

హీరోయిన్ పాత్ర డామినేటింగ్‌గా ఉందా?

“అవును, ఆ క్యారెక్టర్ చాలా ఎంజాయబుల్. ఆమె డామినేషన్ నా పాత్రకు సమస్యగా మారుతుంది. కానీ ఆడియన్స్ మాత్రం బాగా కనెక్ట్ అవుతారు. అక్కడి నుంచే ఫన్ వస్తుంది. కొంచెం అనుమానాస్పదమైన టచ్ కూడా ఉంటుంది.”

నయన్ సారిక గురించి మాట్లాడుతూ, “రెండు మూడు పేజీల సీన్‌ను సింగిల్ టేక్‌లో చేసింది. ఆమె పెర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా ఉంటుంది,” అని ప్రశంసించారు.

ఫస్ట్ హాఫ్ – సెకండ్ హాఫ్ డిఫరెన్స్?

“ఫస్ట్ హాఫ్ యూత్‌కు కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్‌లో ఫ్యామిలీ కామెడీ బలంగా ఉంటుంది. థియేటర్‌లో నవ్వులు గ్యారంటీ.”

మీ పాత్ర ప్రత్యేకత?

“ఇలాంటి పాత్ర నాకు కొత్త. కొన్ని రూల్స్, నమ్మకాలు ఫాలో అయ్యే వ్యక్తి. లెక్చరర్‌గా కనిపిస్తాను. ‘వీరి వీరి గుమ్మడి పండు’ అనే సీక్వెన్స్ థియేటర్‌ను నవ్వులతో బ్లాస్ట్ చేస్తుంది. ఇంటర్వెల్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఉంటుంది.”

మ్యూజిక్ గురించి?

సంగీత దర్శకుడు Rathan గురించి మాట్లాడుతూ, “అన్ని పాటలు కథ నుంచి వచ్చినవే. నాలుగు పాటల్లో మంచి ఫన్ ఉంటుంది. ముందుగానే కంప్లీట్ చేశారు,” అన్నారు. నేపథ్య సంగీతాన్ని Suresh Bobbili అందించారని, అది కూడా అద్భుతంగా వచ్చిందని తెలిపారు.

ఓటీటీ డీల్స్, రిలీజ్ క్లాష్?

“రెండు సినిమాలే కాదు, మరో మూడు సినిమాల డీల్స్ కూడా పూర్తయ్యాయి. రిలీజ్‌కు ముందే నిర్మాతలు హ్యాపీగా ఉండటం సంతోషం. సోలో రిలీజ్ విషయంలో సున్నితంగా బ్యాలెన్స్ చేశాం. ఇంకో కారణం కూడా ఉంది, సరైన సమయం వచ్చినప్పుడు చెబుతాను,” అని అన్నారు.

నిర్మాతల సపోర్ట్?

“సుబ్రమణ్యం గారు, సుమంత్ గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అనుకున్న బడ్జెట్ కంటే 10-15% తక్కువలో పూర్తి చేశాం.”

రాబోయే సినిమాలు?

“‘కామ్రేడ్ కళ్యాణ్’ 80% షూటింగ్ పూర్తైంది. రామ్ అబ్బరాజుతో ఒక సినిమా త్వరలో మొదలవుతుంది. సితారలో సన్నీ అనే కొత్త దర్శకుడితో కూడా ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాను. సింగిల్ సీక్వెల్ కూడా రాస్తున్నారు,” అని వెల్లడించారు.

వేగంగా సినిమాలు చేయడంపై?

“మిడిల్ క్లాస్ కథలు, మన చుట్టూ ఉండే పాత్రలే చేస్తున్నాను. ఇలాంటి సినిమాలు 60-70 రోజుల్లో పూర్తవుతాయి. అందుకే ఫాస్ట్‌గా చేస్తున్నట్టు అనిపిస్తోంది. కామెడీ చేయడం కష్టం, కానీ సిచ్యుయేషనల్ కామెడీ వల్ల వర్కౌట్ అవుతోంది.”

సత్యతో కామెడీ?

“ఇందులో సత్య నా కో-లెక్చరర్‌గా కనిపిస్తాడు. చాలా సరదాగా ఉంటుంది.”

చివరగా, “రెండు గంటలు హాయిగా నవ్వుకునే సినిమా ఇది. ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు,” అని శ్రీ విష్ణు అన్నారు.

‘విష్ణు విన్యాసం’ ఈ ఫిబ్రవరి 27న థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించేందుకు సిద్ధంగా ఉంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.