అంతర్జాతీయం

మోడీ ఇజ్రాయెల్ పర్యటనతో ప్రతి పక్షాలు బేజార్…

Published by
Suresh Thota

భారత ప్రధాని నరేంద్రమోదీ ఫిబ్రవరి 25, 2026న ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన క్నెస్సెట్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రెండు దేశాల గత బంధాలు, రాజకీయ, భద్రతా, ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యాల గురించి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన క్నెస్సెట్ లో భారత ప్రధాని మోదీ చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో విశేష చర్చకు దారి తీసింది. ఇది సాధారణ విదేశీ పర్యటనగా కాకుండా, భారత విదేశాంగ విధానాన్ని స్పష్టంగా వెల్లడించినట్లుగా రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

మధ్యప్రాచ్యంలో సంక్లిష్ట పరిస్థితుల మధ్య ఇజ్రాయెల్ వేదికపై మాట్లాడటం ద్వారా భారత్ తన “వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి” విధానాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పినట్లుగా అయ్యింది. అరబ్ దేశాలతో సంబంధాలు కొనసాగిస్తూనే, ఇజ్రాయెల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరచడం ద్వారా సమతుల్యతను పాటిస్తున్నామని సంకేతం ఇచ్చింది.

ఉగ్రవాదంపై కఠిన వ్యాఖ్యలు చేయడం ద్వారా, భారత ప్రభుత్వంనకు, ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ వైఖరి ఉండదని కుండ బద్దల కొట్టినట్టు గా, దేశీయంగా ప్రజల భద్రత నే ముఖ్యం అందుకు అనుగుణంగానే భారత వ్యవహరిస్తుంది అని చెప్పినట్లుగా అయ్యింది. ఇజ్రాయెల్‌తో రక్షణ, సైబర్ భద్రత, సాంకేతిక రంగాల్లో సహకారం, వ్యవసాయ మరియు టెక్నాలజీ, తదితర రంగాల్లో పరస్పర సాకారం వంటి అంశాలు ను కూడా ప్రస్తావించారు.

ప్రపంచ వేదికపై భారత్ ఒక స్వతంత్ర శక్తిగా, ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతోందనే విషయాన్ని మోదీ ప్రసంగం ద్వారా స్పష్టం చేశారు. ఈ ప్రసంగం ప్రజాస్వామ్య దేశాల మధ్య సహకారం, ఉగ్రవాదంపై సంయుక్త వైఖరి వంటి అంశాలు అంతర్జాతీయ స్థాయిలో భారత్ స్థాయిని, వాణిని బలంగా చెప్పినట్లుగా అంతర్జాతీయ మీడియా విశ్లేషిస్తుంది.

ఇలాంటి పర్యటనలు అధికార పక్షానికి బలమైన నాయకత్వ పటిమ యొక్క స్థాయిని చూపుతూ ఉంటే, ప్రతిపక్షం మాత్రం తటస్థ విధానం పై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం కనపడుతుంది. అయినప్పటికీ ప్రభుత్వం ప్రతిపక్షం యొక్క ఆరోపణలుకు వెరవకుండా తన పని తను చేసుకుపోతుంది. ప్రతిపక్షం మాత్రం దిక్కుతోచని స్థితి లో కొట్టుమిట్టాడుతోంది. మొన్న ప్రపంచ స్థాయిలో జరిగిన AI సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నాయకులు చేసిన పనిని దేశ స్థాయిలో సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు రావడం తో ప్రతిపక్ష కాంగ్రెస్ కు ఏమి చేయాలో, ఎలా సమర్థించుకోవాలో అర్థం కావడం లేదు అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

క్నెస్సెట్‌లో మోదీ ప్రసంగం…

భారత్ విదేశాంగంలో స్పష్టత, భద్రతా రాజకీయాల్లో దృఢత్వం, గ్లోబల్ వేదికపై ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

Recent Posts

  • ఓటిటి న్యూస్

‘పల్లబురుసు’.. ఓటీటీ స్ట్రీమింగ్!

సెప్టెంబర్ 3, 2026