సినిమా వార్తలు

‘దాదా ధమాకా’తో బాలయ్య మాస్ జాతర.. నవంబర్ 13న ఫస్ట్ సింగిల్ రిలీజ్!

Published by
Srinivas

నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన మాస్ ఎనర్జీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దాదా’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్‌పై అభిమానులు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా దీపావళి సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. బాలకృష్ణ, బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ కలిసి కనిపించిన ఈ పోస్టర్‌లో స్టైలిష్ అండ్ కలర్‌ఫుల్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాదు, సినిమా ఫస్ట్ సింగిల్ పేరును ‘దాదా ధమాకా’గా ప్రకటిస్తూ నవంబర్ 13న పాటను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

లెదర్ జాకెట్, సన్‌గ్లాసెస్‌తో బాలకృష్ణ సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండగా, నర్గీస్ ఫక్రీ గ్లామరస్ అవతార్‌లో ఆకట్టుకుంటున్నారు. గ్రాండ్ లైటింగ్, పండగ వాతావరణం మధ్య వీరిద్దరి కెమిస్ట్రీ పోస్టర్‌కు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. దీపావళి సంబరాలకు కొనసాగింపుగా ‘దాదా ధమాకా’ రూపంలో మ్యూజికల్ ధమాకా అందించబోతున్నారు.

ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సినిమాలకు తనదైన మాస్ బీట్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమన్, ఈ పాటను ఎలా కంపోజ్ చేశారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఫస్ట్ సింగిల్‌తోనే మ్యూజిక్ ప్రమోషన్స్‌కు భారీ ఊపు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తుండగా, రామ్-లక్ష్మణ్, రవివర్మ, వి. వెంకట్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను రూపొందిస్తున్నారు.

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘దాదా’ డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ముందుగా నవంబర్ 13న రానున్న ‘దాదా ధమాకా’ పాటతో బాలయ్య అభిమానులకు అసలైన మాస్ ట్రీట్ అందనుంది. మరి ఈ ఫస్ట్ సింగిల్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts