దివంగత నటుడు శ్రీహరి జయంతి సందర్భంగా ఆయన తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న ‘ఆస్మాన్’ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పోస్టర్‌లో కనిపించిన విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.
శ్రీ క్లీంకర సెల్యులాయిడ్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్నారు. కొండారు వెంకటేష్, మన్నెం శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. కొండారు శ్రీనివాసరావు సమర్పిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, అరబిక్ భాషల్లో రూపొందిస్తున్నారు.
‘ఆస్మాన్’ మోషన్ పోస్టర్‌లో మేఘాంశ్ చేతిలో టార్చ్ పట్టుకుని ఓ భారీ అరచేతిపై నిలబడి కనిపించాడు. ఆ అరచేయి ఎవరిది? అందులో ఉన్న వ్యక్తి ఎవరు? మేఘాంశ్ పోషిస్తున్న పాత్ర ఏంటి? అనే ప్రశ్నలు వచ్చేలా పోస్టర్‌ను డిజైన్ చేశారు. భారీ అరచేతి వెనుక కనిపించే వ్యక్తి నుదుటిపై ప్రత్యేకమైన బొట్టు ఉండటం, చుట్టూ టార్చ్‌లు పట్టుకుని నిల్చున్న వ్యక్తులు కనిపించడం పోస్టర్‌కు మిస్టరీ టచ్ ఇచ్చింది.
దర్శకుడు రామ్ నందన్ మాట్లాడుతూ ‘ఆస్మాన్’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే చిత్రమని తెలిపారు. థియేటర్లలో సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని అన్నారు. తనపై నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌ను అప్పగించిన నిర్మాత కొండారు వెంకటేష్, హీరో మేఘాంశ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
హీరో మేఘాంశ్ మాట్లాడుతూ ‘ఆస్మాన్’లో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు రామ్‌తో పనిచేయడం మంచి అనుభవంగా ఉందన్నారు. రాయంచ్ హీరోయిన్‌గా నటిస్తున్నారని, ప్రశాంత్ ఆర్ విహారి అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు.
శాంతి శ్రీహరి మాట్లాడుతూ.. మేఘాంశ్‌పై నమ్మకంతో ఈ సినిమా చేస్తున్న దర్శకుడు, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. షూటింగ్‌లో మేఘాంశ్ ఎంతో కష్టపడుతున్నాడని చెప్పారు. ఫస్ట్ లుక్ చూసిన తర్వాత తనకు మేఘాంశ్ చిన్న పిల్లాడిలా కాకుండా సింహంలా కనిపించాడని ఆమె చెప్పడం ప్రత్యేకంగా నిలిచింది.
నిర్మాత కొండారు వెంకటేష్ కూడా మేఘాంశ్ నటన, ఫిజిక్, ఎనర్జీపై ప్రశంసలు కురిపించారు. తెరపై మాత్రమే కాకుండా నిజ జీవితంలోనూ మేఘాంశ్ ఒక హీరోలా ఉంటాడని అన్నారు.
హీరోయిన్ రాయంచ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందని తెలిపారు. కాన్సెప్ట్ పోస్టర్ నుంచే సినిమాకు మంచి స్పందన వస్తోందని, త్వరలో షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు.
సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి, సినిమాటోగ్రాఫర్ షోయబ్ కూడా ఈ విభిన్నమైన ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. శ్రీహరితో కలిసి ‘వీకెండ్ లవ్’లో నటించిన రవి వర్మ.. ఆయన జయంతి రోజున ‘ఆస్మాన్’ ఫస్ట్ లుక్ విడుదల కావడం ప్రత్యేకమని పేర్కొన్నారు.
మొత్తానికి మిస్టరీతో కూడిన ఫస్ట్ లుక్, మేఘాంశ్ డిఫరెంట్ లుక్, భారీ కాన్సెప్ట్‌తో ‘ఆస్మాన్’పై ఆసక్తి మొదలైంది. సినిమా నుంచి రాబోయే తదుపరి అప్‌డేట్స్‌పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.