సినిమా వార్తలు

హీరోయిన్లతో రూమర్స్… భయపడిన నాగవంశీ?

Published by
Srinivas

హీరోయిన్లకు స్టేజీపై ఐ లవ్ యూ చెప్పిన హీరోలు, డైరెక్టర్లు ఉన్నారు. ఆఖరికి లవ్ యూ అన్న ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. కానీ అందమైన అమ్మాయిని పట్టుకుని సిస్టర్ అని యంగ్ ప్రొడ్యూసర్ అంటున్నారు. బహుశా, సోషల్ మీడియాలో రూమర్లకు భయపడ్డారని అనుకోవాలి. ఓం సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తే, శ్రీలీలను చెల్లి అన్నారు నాగవంశీ.

నాగవంశీ దేనికీ భయపడే రకం కాదు. ఓపెన్ మైండెడ్ మనిషి. సినిమా ఫ్లాప్ అయితే ఆడలేదని ఒప్పుకొనే మనిషి. క్లోజ్ ప్రొడ్యూసర్లపై సెటైర్లు వేస్తారు కూడా. ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్లో డ్రాగన్ సెట్ నుంచి వచ్చా, ఫౌజీ సెట్ నుంచి వచ్చా అంటే బాగోదు అంటూ మైత్రీ మూవీ మేకర్స్ రవి శంకర్ పంచ్ వేశారు. కానీ శ్రీలీలను పట్టుకుని సిస్టర్ అన్నారు. ఆ మాట కొందరికి షాక్ ఇచ్చింది.

నాగవంశీ నిర్మించిన ఆదికేశవ, మాస్ జాతర సినిమాల్లో శ్రీలీల హీరోయిన్. ఆ రెండిటి మధ్యలో ఆయన చిన్నాన్న ఎస్ రాధాకృష్ణ నిర్మించిన గుంటూరు కారంలో కూడా శ్రీలీల నటించారు. హీరోయిన్ – నిర్మాతగా ఇద్దరి మధ్య అనుబంధం ఉంది. ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత వాళ్ళిద్దరిదీ సిస్టర్ – బ్రదర్ రిలేషన్ అని అర్థమైంది.

శ్రీలీలను సిస్టర్ అనడం వెనుక సోషల్ మీడియాలో వచ్చే రూమర్లకు నాగవంశీ భయపడ్డారా? అని నెటిజన్లు కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య కొంత మంది అందాల భామలతో ఆయనకు ముడి పెడుతూ ట్వీట్లు, రెడిట్ పోస్టులు వచ్చాయి. దాంతో ఆయన జాగ్రత్త పడ్డారని అనుకోవాలేమో.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts