సినిమా వార్తలు

అడివి శేష్ యాక్షన్ డ్రామా ‘డకాయిట్’ అప్‌డేట్

Published by
Srinivas

అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘డకాయిట్’ నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వెలువడింది. ఇప్పటికే విడుదలైన ఫైర్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, ఇప్పుడు మేకర్స్ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.

2026 ఉగాది కానుకగా మార్చి 19న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్‌ల ఇంటెన్స్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. వారిద్దరి కెమిస్ట్రీతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ పోస్టర్ నుంచే హైలైట్ అయ్యాయి.

ప్రేమ, ప్రతీకార కథాంశంపై రూపొందుతున్న ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫైర్ గ్లింప్స్‌లో స్టైలిష్ విజువల్స్, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ సృష్టించాయి. విజువల్ ప్రెజెంటేషన్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసినట్లు సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా ఆయన నటిస్తున్న తొలి తెలుగు చిత్రం కావడం ‘డకాయిట్’కు మరింత ప్రత్యేకతను తెచ్చింది.

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాత. చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు.

స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ‘డకాయిట్’ 2026లో ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, సినీప్రేమికులు ఇప్పటి నుంచే ఈ సినిమాపై భారీగా ఆసక్తి చూపుతున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.