సినిమా వార్తలు

శ్రీలంకలో రామ్ చరణ్ ‘పెద్ది’…

Published by
Srinivas

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘పెద్ది’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ మరియు ఫస్ట్ షాట్ అభిమానులకి గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక గ్రామీణ నేపథ్యంలో నడిచే స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. భావోద్వేగాలు, మానవ విలువలు, కష్టపడి గెలిచే ఆత్మవిశ్వాసం… ఈ కథలో ప్రధానాంశాలుగా ఉంటాయని సమాచారం.

తాజాగా ‘పెద్ది’ టీమ్ శ్రీలంకలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. అక్కడ రామ్ చరణ్ – జాన్వి కపూర్‌లపై అందమైన లొకేషన్స్‌లో కొన్ని కీలక సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. మేకర్స్ విడుదల చేసిన బీహైండ్ ద సీన్స్ (BTS) ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందులో సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు, దర్శకుడు బుచ్చి బాబు సన అద్భుతమైన రైల్వే టన్నెల్ పక్కన చర్చలు జరుపుతున్న దృశ్యాలు చూడొచ్చు.

అంతేకాదు, ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఏ.ఆర్. రహ్మాన్ త్వరలోనే ‘పెద్ది’ ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేసే అవకాశం ఉందనే టాక్ ఇండస్ట్రీలో హాట్‌గా మారింది. త్వరలో రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న తన హైదరాబాద్ రెహమాన్ లైవ్ కచేరీ సందర్భంగా ఆ పాటను రిలీజ్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే, సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌కు అది ఒక గ్రాండ్ ఆరంభం అవుతుంది.

వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

గ్రామీణ వాతావరణంలో నడిచే భావోద్వేగ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ‘పెద్ది’ ఇప్పటికే ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా నిలిచింది. చరణ్ – బుచ్చి బాబు కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.