Download App

అనిల్ రావిపూడి సినిమా… కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ వైరల్

జూలై 6, 2026 By Srinivas
నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ నుంచి కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం #VenkyAnil5 మరియు #NKRAR2 పేర్లతో రూపొందుతున్న...
అనిల్ రావిపూడి సినిమా… కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ వైరల్

నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ నుంచి కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం #VenkyAnil5 మరియు #NKRAR2 పేర్లతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది.

విడుదలైన పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ పక్కా పండుగ లుక్‌లో కనిపించారు. తెల్లటి పంచె, కుర్తా, మెడలో పూలదండ, కళ్లపై స్టైలిష్ గ్లాసెస్‌తో డ్యాన్స్ స్టెప్ వేస్తూ ఆయన ఇచ్చిన పోజ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పోస్టర్ మొత్తం పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా రూపొందించగా, ఇది సినిమా టోన్ ఎలా ఉండబోతుందో చెప్పేస్తోంది.

మరో విశేషం ఏమిటంటే.. ఈ ఫస్ట్ లుక్‌ను అభిమానులతో పంచుకునేందుకు కళ్యాణ్ రామ్ తొలిసారిగా Instagramలోకి ఎంట్రీ ఇచ్చారు. @nandamurikalyanram పేరుతో అకౌంట్ ప్రారంభించిన ఆయన, “అనిల్ రావిపూడి జోన్‌లో ఉండటం ఎప్పుడూ ఆనందమే… సంక్రాంతి 2027కి బ్లాస్ట్‌కు రెడీ అవ్వండి” అంటూ పోస్ట్ చేశారు.

అనిల్ రావిపూడి సినిమా… కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ వైరల్

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి కనిపించనుంది. సంగీతాన్ని జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి, ఎడిటింగ్‌ను తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైన్‌ను ఏఎస్ ప్రకాష్ నిర్వహిస్తున్నారు.

అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, పండుగ వాతావరణంతో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ సంక్రాంతి 2027 బాక్సాఫీస్ రేసులో ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading