సినిమా వార్తలు

అనుష్క రిస్క్ తీసుకుని ఆ సీన్ చేశారు: చైతన్యరావు

Published by
Rahul N

“అనుష్కని ఒకసారి లైఫ్‌లో చూస్తే చాలు అనుకున్నాను. అలాంటి వాళ్లతో కలిసి నటించడం నాకు మెమొరబుల్ అనుభవం. చింతకాయల రవి నా ఫేవరెట్ సినిమా. దాన్ని 30 సార్లు చూసి ఉంటాను. నేను అనుష్కకి చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఆమె నిజంగా ఒక బిగ్ లేడీ సూపర్‌స్టార్, కానీ వెరీ స్వీట్ పర్సన్” అంటూ ఘాటి సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు చైతన్యరావు తన ఎమోషనల్ ఫీలింగ్స్ షేర్ చేసుకున్నారు.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఘాటి సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌గా నటిస్తుండగా, యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు.

తన పాత్ర గురించి మాట్లాడుతూ చైతన్యరావు—“ఇది రెగ్యులర్ విలన్ క్యారెక్టర్ కాదు. క్రిష్ దీన్ని ఒక మెయిన్ ఐకానిక్ క్యారెక్టర్‌లా డిజైన్ చేశారు. లుక్ కోసం రెండు రోజులపాటు రకరకాల ట్రైలు చేసి చివరికి ఈ లుక్‌కి ఫైనల్ అయ్యాం. షూట్ సమయంలో క్రిష్ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. నేను కొన్ని ఐడియాస్ చెప్పాను, ఆయన ఇన్‌పుట్స్ ఇచ్చారు. చివరికి రోల్ చాలా పవర్‌ఫుల్‌గా వచ్చింది” అని తెలిపారు.

ఈస్ట్రన్ ఘాట్స్‌లో జరిగిన షూట్ గురించి ఆయన చెప్పారు—“ఒక జలపాతం సీన్ చాలా రిస్కీగా అనిపించింది. అనుష్క గారు ఆ సీక్వెన్స్‌ని రిస్క్ తీసుకుని అద్భుతంగా చేశారు. ఆ సీన్ మీరు చూస్తే తప్పకుండా థ్రిల్ అవుతారు.”

క్రిష్‌తో వర్క్ అనుభవంపై చైతన్యరావు—“ఆయన ప్రతి యాక్టర్‌కి ఫ్రీడమ్ ఇస్తారు. అందరి సజెషన్స్ వింటారు. ఈ రోల్‌కి నేను పర్ఫెక్ట్‌గా యాప్ అవుతానని ఆయన నమ్మారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను” అని అన్నారు.

సినిమాటోగ్రఫీ మనోజ్, మ్యూజిక్ సాగర్ నాగవల్లి ఈ సినిమాకి ప్రత్యేక హైలైట్స్ అవుతాయని కూడా ఆయన చెప్పారు. “మాయసభతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఘాటి కూడా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ పిల్లర్ అవుతుంది” అంటూ తన విశ్వాసం వ్యక్తం చేశారు.

Rahul N

Recent Posts