రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘రాజా సాబ్’ పై ఎదురుచూపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ భారీ చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్న వెర్సటైల్ యాక్టర్ బొమన్ ఇరానీ బర్త్‌డేను పురస్కరించుకుని, సినిమా టీమ్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది.
‘రాజా సాబ్’లో బొమన్ ఇరానీ పోషిస్తున్న పాత్ర ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గానే కాక, కథను ముందుకు తీసుకెళ్లే కీలక పాత్రలో కనిపించబోతున్న ఆయన క్యారెక్టర్ ప్రేక్షకులకు ప్రత్యేక థ్రిల్ ఇవ్వనుందని టీమ్ తెలిపింది.
సంక్రాంతి పండగను మరింత సందడిగా మార్చేందుకు, ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కి సిద్ధమవుతోంది. ఎప్పటికీ గుర్తుండిపోయే హారర్ కామెడీగా నిలిపేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు మారుతి పేర్కొన్నారు.
భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మిస్తున్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్, ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘రెబల్ సాబ్’కు విపరీతమైన స్పందన రావడంతో టీమ్ ఉత్సాహంగా ఉంది.
ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రంపై ప్రేక్షకులు మాత్రమే కాకుండా ట్రేడ్ వర్గాల్లో కూడా విశేష ఆసక్తి నెలకొంది. విడుదల రోజున ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.