సినిమా వార్తలు

Chiranjeevi చేతికి పట్టీ… అసలేమైంది..?

Published by
Srinivas

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చేతికి పట్టీతో కనిపించడంతో అభిమానుల్లో కొంత ఆందోళన నెలకొంది. సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వినిపించాయి. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? షూటింగ్స్‌పై ప్రభావం ఉంటుందా? అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.

ఈ నేపథ్యంలో చిరంజీవి స్వయంగా ఎక్స్‌ (X) వేదికగా క్లారిటీ ఇచ్చారు. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కేవలం చిన్నపాటి షోల్డర్ కీహోల్ సర్జరీ మాత్రమే జరిగిందని, అది కూడా ముందస్తు జాగ్రత్త చర్యగా చేసుకున్న ప్రక్రియ అని వివరించారు. ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకుంటూ సాధారణ దినచర్యలో ఉన్నానని వెల్లడించారు.

సర్జరీని నైపుణ్యంతో నిర్వహించిన ఆర్థ్రోస్కోపీ నిపుణుడు డాక్టర్ నితిన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అభిమానులు చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

కెరీర్ విషయానికి వస్తే, రీజినల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన Mana Shankara Vara Prasad Garu తర్వాత చిరంజీవి ప్రస్తుతం Vishwambhara చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాదు, దర్శకుడు Bobby Kolliతో మరో ప్రాజెక్ట్‌కు కూడా సిద్ధమవుతున్నారు.

అభిమానులు మాత్రం మెగాస్టార్ త్వరగా పూర్తిగా కోలుకుని మరింత ఉత్సాహంగా తెరపై కనిపించాలని ఆశిస్తున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.