సినిమా వార్తలు

‘కూలీ’ నన్ను బెటర్ యాక్టర్‌గా ఫీల్ అయ్యేలా చేసింది: నాగార్జున

Published by
Rahul N

సూపర్‌స్టార్ రజనీకాంత్ – లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘కూలీ’ ఆగస్టు 14న విడుదల కానుంది.

హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ, “సైమన్‌ పాత్ర కథలో ఆల్‌మోస్ట్ హీరోలాంటిది. ఇలాంటి నెగటివ్ రోల్ చేయడం నా కెరీర్‌లో మొదటిసారి. లోకేష్‌ నరేషన్‌ విన్న వెంటనే రికార్డ్ చేసుకొని మళ్లీ మళ్లీ విన్నాను. కొన్ని సూచనలు ఇచ్చా, వాటిని పరిగణనలోకి తీసుకొని పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. థాయ్‌లాండ్‌లో 17 రోజులు రాత్రిపూట భారీ యాక్షన్ సీన్స్ చేశాం. రజనీకాంత్ గారితో పనిచేయడం మర్చిపోలేని అనుభవం. ఆయన సెట్లో అందరితో మమేకమవడం, చివర్లో యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ గిఫ్ట్స్ ఇవ్వడం చూసి మనసు ద్రవించింది. ఈ సినిమా నన్ను బెటర్ యాక్టర్‌గా మార్చింది” అన్నారు.

రజనీకాంత్ ప్రత్యేక వీడియో సందేశంలో మాట్లాడుతూ, “కూలీ నా డైమండ్ జూబ్లీ పిక్చర్. తెలుగులో రాజమౌళి ఎలాగో తమిళంలో లోకేష్ అలాంటి దర్శకుడు. ఈ కథ విన్న వెంటనే సైమన్‌ పాత్ర నేనే చేయాలని అనిపించింది. కానీ నాగార్జున గారు చేసిన తీరు చూసి నేను చేయలేనన్న భావన కలిగింది. ఆయన అదరగొట్టారు. మేమిద్దరం 33 ఏళ్ల తర్వాత కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది” అని ప్రశంసించారు.

దర్శకుడు లోకేష్ మాట్లాడుతూ, “నాగార్జున గారిని ఈ సినిమాలో ఒప్పించడానికి దాదాపు 7 నరేషన్స్ ఇచ్చా. ఆయన అంగీకరించడంతో సైమన్‌ పాత్రకు జీవం వచ్చింది” అన్నారు.

శృతిహాసన్, సత్యరాజ్, సురేష్ బాబు, దిల్ రాజు చిత్రంపై ప్రశంసలు కురిపించారు.

ఆమిర్ ఖాన్, సత్యరాజ్, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మించిన ఈ పాన్‌ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్‌ను తెలుగు రాష్ట్రాల్లో ఆసియన్ మల్టీప్లెక్స్ గ్రాండ్‌గా విడుదల చేయనుంది.

Rahul N

Recent Posts