సినిమా వార్తలు

‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుంచి ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’

Published by
Srinivas

మెగాస్టార్ Chiranjeevi మరియు విక్టరీ స్టార్ Venkatesh కలిసి నటిస్తున్న క్రేజీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారుపై అంచనాలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. Anil Ravipudi దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, తాజాగా మేకర్స్ నుంచి వచ్చిన మ్యూజికల్ అప్‌డేట్ ఫుల్ జోష్‌ను క్రియేట్ చేస్తోంది.

ఈ చిత్రంలోని థర్డ్ సింగిల్ ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ను డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రోమోను రేపు రిలీజ్ చేయనుండటంతో సోషల్ మీడియాలో ఇప్పుడే హైప్ మొదలైంది.

సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌నే చూస్తే ఎనర్జీ, సెలబ్రేషన్, మాస్ వైబ్స్ అన్నీ కలగలిసినట్టుగా కనిపిస్తోంది. స్టైలిష్ డాన్స్ పోజుల్లో చిరంజీవి, వెంకటేశ్ ఇద్దరూ అదరగొట్టగా, బ్యాక్‌గ్రౌండ్‌లో డ్యాన్సర్లతో కలిసి పూర్తి ఫెస్టివ్ వాతావరణాన్ని సృష్టించారు. డెనిమ్ లుక్‌తో సన్‌గ్లాసెస్‌ ధరించిన చిరంజీవి మెగా స్వాగ్‌తో కనిపిస్తే, రెడ్ జాకెట్‌లో వెంకటేశ్ స్టన్నింగ్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇద్దరి మాస్ అప్పీల్, స్క్రీన్ ప్రెజెన్స్ పీక్స్‌లో ఉండటం విశేషం.

ఈ పాట బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఆంథమ్‌గా మ్యూజిక్ చార్ట్స్‌ను షేక్ చేయబోతుందని అభిమానులు నమ్ముతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ సాంగ్‌గా మారనుంది.

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్‌తో మంచి బజ్ తెచ్చుకున్న మన శంకర వర ప్రసాద్ గారు జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Srinivas