సినిమా వార్తలు

శివాజీ చెబితే వినరా… ఛత్రపతి శివాజీ చెప్పాలా ?

Published by
Srinivas

హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు…. ఈ శీతాకాలంలో వేడి పుట్టిస్తున్నాయి.సామాన్య ప్రజలు శివాజీ వ్యాఖ్యలు వెనుక గాఢత, ఒక బాధ్యత కలిగిన వ్యక్తి సీనియర్ ఆర్టిస్ట్ గా ఆయన మాటలు అర్ధం చేసుకోవాలని చెబుతున్నారు. అతనికి అండగా నిలుస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో…. అతను వాడిన పదజాలానికి క్షమాపణ చెప్పిన తర్వాత… శివాజీ కి ప్రజల్లో విపరీతమైన స్పందన తో కూడిన మద్దతు లభిస్తుంది.

సోషల్ మీడియాలో కొంతమంది ఇంకా దూకుడు గా వ్యవహరిస్తున్నారు. రాజా సాబ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ “నిధి అగర్వాల్” ఉదంతం మనం అందరం చూసిందే…. ఏమైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ఆ తర్వాత ఆ అమ్మాయి దే తప్పు అంటూ ఒక మాటతో ఎవరికి వాళ్ళు తప్పించుకుంటారు. ముందుగా హెచ్చరిస్తే ఇదిగో ఈ విధంగా దాడి చేస్తున్నారు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.

ఒక ఫంక్షన్ కి వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి అని చెబితే ఇంత రాద్ధాంతం చేస్తారా అని అడుగుతున్నారు. పైగా MAA అసోసియేషన్ లో పిర్యాదు చేశారు ఫిమేల్ ఆర్టిస్టులు, మంచు లక్ష్మీ, యార్లగడ్డ సుప్రియ, ఝాన్సీ, డైరెక్టర్ నందిని రెడ్డి, నిర్మాత స్వప్న దత్ తదితరులు పిర్యాదు చేశారు.

కాని సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం శివాజీకి చాలా మద్దతుగా మాట్లాడుతున్నారు. ఏపీ ప్రభుత్వ హోమ్ మినిస్టర్ అనిత , బీజేపీ నాయకురాలు డి. పురంధరేశ్వరిల వస్త్రధారణ, చక్కటి బొట్టుతో హుందాగా ఉంటుందని, తెలంగాణలో కొండా సురేఖ, సీతక్క ఇటువంటి వాళ్ళు ఎంత హుందాగా ఉంటారో నెటిజన్లు ఉదహరిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఇవన్నీ చూస్తుంటే…. సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్స్, వాళ్ళ వస్త్రధారణ మీద పబ్లిక్ ఎంత కోపంగా ఉన్నారో అర్దం అవుతుంది. సినిమాలో కథను బట్టి వస్త్ర ధారణ ఉంటుంది. పాత్రోచితంగా నటిస్తారు కాబట్టి దానికి పబ్లిక్ ఏమి అనడం లేదు. కాని బయట వివిధ సినిమా ప్రచార కార్యక్రమాలలో పాల్గొనేటప్పుడు అయిన హుందాతనంతో ఉండాలని సోషల్ మీడియా వేదికగా పబ్లిక్ వ్యాఖ్యానించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మా బట్టలు మా ఇష్టం ఇవేమీ పట్టించుకోము అంటే అది వారి విజ్ఞత.

నేను హీరో శివాజీ కి, ఆయన మాటలకు మద్దతు ఇస్తున్న… స్త్రీ శక్తి స్వరూపం, ప్రకృతినీ స్త్రీ తోనే పోలుస్తారు…. అటువంటిది…. హీరోయిన్స్ నలుగురికి ఆదర్శంగా ఉండాలి కాని, అసహ్యించుకునేలా ఉండకూడదు అని సోషల్ మీడియా వేదిక గా ఒక స్త్రీమూర్తి…. వ్యాఖ్యానించారు.

మరాఠీ సినిమాలో నటించే నటీమణులు ఏ సినిమా ఫంక్షన్ కైన చాలా పద్ధతిగా సాంప్రదాయ బద్దంగా వస్తారు.. బహుశా అక్కడ ఛత్రపతి శివాజీ పుట్టడం వలనే అలా వస్తున్నారేమో…. ఇక్కడ ఈ సినిమా శివాజీ చెబితే వింటారా…. అని సోషల్ మీడియా వేదికగా మరొకరు వ్యాఖ్యానించారు.

Srinivas