మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘తులాభారం’పై అంచనాలు పెరుగుతున్నాయి. రవితేజ ట్రేడ్‌మార్క్ ఎనర్జీ, వివేక్ ఆత్రేయ విభిన్నమైన కథా కథనాలు కలగలిసి ఈ సినిమాను క్రైమ్, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన ప్రత్యేకమైన చిత్రంగా రూపొందిస్తున్నాయి. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీనిరావు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ‘తులాభారం: ది టైటిల్ డాక్యుమెంటరీ’ వీడియోకు మంచి స్పందన లభించింది. ఈ సినిమాతో రవితేజ సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటివరకు తన ఎనర్జీ, మాస్ ఇమేజ్‌తో అలరించిన ఆయన.. ఈసారి ‘క్రైమ్ మహారాజా’గా కొత్త గుర్తింపును సొంతం చేసుకోనున్నారు. ‘నవ రవితేజం’ పేరుతో విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
తాజాగా ‘తులాభారం’ షూటింగ్‌లో రవితేజ అడుగుపెట్టారు. తన ఫస్ట్ డే షూట్‌లో ఆయన పాల్గొనగా, పలువురు కీలక నటీనటులు కూడా చిత్రీకరణలో జాయిన్ అయ్యారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ను భారీ స్థాయిలో కొనసాగిస్తున్నారు.
ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, ప్రియాంక మోహన్, అనస్వర రాజన్, జేడీ చక్రవర్తి, అనిల్ కరెళ్ల, రవి ఆంటోనీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలు, ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుందని చిత్ర బృందం భావిస్తోంది.
ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, తేని ఈశ్వర్ ISC సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, జీఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
‘తులాభారం’తో రవితేజ ఎలాంటి కొత్త ప్రయోగం చేయబోతున్నారు? వివేక్ ఆత్రేయ తనదైన కథనంతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోనున్నారు? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ‘క్రైమ్ మహారాజా’గా రవితేజ కొత్త అవతారం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.