సినిమా వార్తలు

సంస్కృతంతో భారత్… అద్భుత ప్రయోగం

Published by
Srinivas

AI ప్రపంచంలో సరికొత్త విప్లవం… సంస్కృతంతో భారత్ అద్భుత ప్రయోగం.. నేడు ప్రపంచమంతా కృత్రిమ మేధ (AI) చుట్టూనే తిరుగుతోంది. భారతదేశం కూడా చాలా నిశ్శబ్దంగా, చాలా లోతైన చారిత్రక ప్రయోగం ప్రారంభించింది.

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అత్యంత నిర్మాణాత్మకమైన భాష సంస్కృతం. దాని కోసం ఒక స్వదేశీ Large Language Model (LLM) నమూనా నీ రూపకల్పన చేస్తుంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు నేతృత్వం వహిస్తున్నది MDS సంస్కృత కళాశాల, మన ప్రాచీన విజ్ఞానాన్ని డిజిటల్ యుగంలోకి తీసుకువెళ్లే దిశగా ఒక కీలక అడుగు. కేవలం ట్రాన్స్‌లేషన్ టూల్ కాదు, గూగుల్ ట్రాన్స్‌లేట్ లాంటి అనువాదానికి సంబంధించినది కాదు.

సంస్కృతం యొక్క… వ్యాకరణం,నిర్మాణం, తర్కం , దానిని అర్థం చేసుకునే AI పద్ధతి లో అంటే సంస్కృతాన్ని సంస్కృతంలానే అర్థం చేసుకునే మొట్టమొదటి AI ప్రయత్నం జరుగుతుంది. దీని వల్ల ఆయుర్వేద గ్రంథాలు, AI తో అనుసంధానించడం వలన వైద్య పరంగా కూడా అద్భుత ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

ఇందుకు ఐటీ , డేటా సైన్స్ నిపుణులు మరియు సంస్కృత పండితులు, సంయుక్త బృందంతో 3 సంవత్సరాల సమయం లోపల ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డేటా ని డిజిటల్ గా మార్చడానికి అద్భుతమైన వేగం తో పని చేస్తున్నారు. MDS సంస్కృత కళాశాల మరియు Kuppuswami Sastri Research Institute (KSRI) వద్ద, రమారమి 1,10,000 పైగా సంస్కృత గ్రంథాలు, అరుదైన పుస్తకాలు,వేలాది తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. వీటి కోసం స్వంత సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేశారు. 24 గంటల్లో 1,000 కు పైగా పుస్తకాలు డిజిటల్ చేస్తున్నారు. చాలా ఖచ్చితత్వం తో ఈ AI రూపుదిద్దుకుంటుంది.

వీటి వల్ల భవిష్యత్తులో సంస్కృతంలో నేర్చుకుని, శాస్త్రగ్రంథాలపై ప్రశ్నలు అడిగే చాలా అప్లికేషన్స్ అందుబాటులోకి వస్తాయి. సంధి విభజన, సమాసాల విశ్లేషణ, వ్యాకరణం మొదలగునవి, ఆధునిక భాషలకంటే క్లిష్టమైనవే. అందుకే సంస్కృత పండితులు మరియు డేటా శాస్త్రవేత్తలు కలిసి చాలా జాగ్రత్తగా రూపొందిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ను మరింత విస్తరించేందుకు IIT Madras, National Sanskrit Universityతో సంప్రదింపులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తన ఆధ్వర్యం లో “భాషిని” అనే ప్లాట్‌ఫాం ద్వారా 22 ఇండియన్ లాంగ్వేజ్‌లు మరియు కొన్ని ట్రైబల్ భాషలను AI ద్వారా అందిస్తోంది. ప్రభుత్వ “భాషిని” ప్రాజెక్ట్‌తో అనుసంధానమైతే భారత్‌కు ఒక National Digital Heritage Infrastructure సిద్ధమవుతుంది. అని చారిత్రక పరిశోధకుల భావన.

సంస్కృతం ఇక కంప్యూటింగ్ భాషగా రూపాంతరం చెందుతుంది. భారత్ కూడా మన ప్రాచీన విజ్ఞానం, ఆయుర్వేదం గ్రంథాలను, నాగరికత లకు సంబంధించిన వారసత్వం మీద పెట్టుబడి పెడుతోంది.

ఈ ప్రయోగం విజయవంతమైతే, సంస్కృతం కేవలం పురాతన భాష నే కాక…. AI యుగంలో మన నాగరికతను, ప్రాచీన జ్ఞాన భాండాగారాన్ని , ప్రపంచానికి మరియు భవిష్యత్తు తరాలకు AI ద్వారా అందించే చారిత్రక ప్రయత్నం ఇది.

Srinivas