పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘OG’ పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ‘రన్ రాజా రన్’(Run Raja Run), ‘సాహో’(Saaho) వంటి క్రేజీ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సుజిత్ (Sujeeth), ఈ సారి పవర్ స్టార్ తో చేసిన సినిమా కాబట్టి క్రేజ్ మరింత రెట్టింపు అయ్యింది. ఇక డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు గ్లింప్స్ తోనే అద్భుతమైన బజ్ ఏర్పడింది. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వంటి హంగామాలు లేకుండానే భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని మేకర్స్ బల్లగుద్ది చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, ఈ సినిమా చుట్టూ మరో పెద్ద చర్చ నడుస్తోంది. అదేంటంటే – ‘OG’ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఎంట్రీ ఉందట!. ఈ వార్త చాలా కాలంగా మీడియాలో వినిపిస్తున్నా, ఎటువంటి అధికారిక సమాచారం లేకపోవడంతో చాలామంది వట్టి గాసిప్ అని కొట్టిపారేశారు. అయితే ఇప్పుడు మాత్రం ఇన్సైడ్ టాక్ బలంగా వినిపిస్తోంది.
సుజిత్ గత చిత్రం ‘సాహో’ ప్రభాస్‌తో చేసారు. ప్రభాస్‌కు సుజిత్‌పై ఉన్న నమ్మకం, అలాగే సుజిత్‌కు ప్రభాస్ స్నేహితులైన యూవీ క్రియేషన్స్తో ఉన్న బంధం దృష్ట్యా ఈ కేమియోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చని టాక్. “సుజిత్ అడిగితే ప్రభాస్ కచ్చితంగా నో చెప్పడని” ఫ్యాన్స్ నమ్మకం.
కానీ ప్రశ్న ఒక్కటే – ‘OG’ లో ప్రభాస్ ని ఎలా ఇరికించాడు?’. ఎందుకంటే ఈ సినిమా కథ 90వ దశకంలో నడుస్తుంది. కానీ ‘సాహో’ టైమ్‌లైన్ 2019లో సెట్ అయింది. కాబట్టి ‘సాహో’ క్యారెక్టర్ ని ఇక్కడ మిళితం చేయడం లాజికల్ గా వర్క్ అవుట్ కావడం కష్టమే. మరి ఈ కేమియో పూర్తిగా కొత్త పాత్రేనా? లేకపోతే పవన్ – ప్రభాస్ లను స్క్రీన్‌పై ఒక్క ఫ్రేమ్‌లో చూపించే స్పెషల్ ఎలిమెంటా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఇంకా దీనికి సమాధానం దొరకాలంటే, రిలీజ్ దాకా వెయిట్ చేయాల్సిందే. అప్పటివరకు ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ ఎంట్రీ నిజమని నమ్మి ఊగిపోతున్నారు.