సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ లుక్స్ మామూలుగా లేవు.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న ‘OG’ క్రేజీ స్టిల్స్…

Published by
Srinivas

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా, దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘OG’పై క్రేజ్ రోజు రోజుకీ ఆకాశాన్ని తాకుతోంది. ఈ సినిమా మొదట గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడింది. కానీ అంచనాలు మాత్రం తగ్గడం దూరం, మరింత రెట్టింపు అయ్యాయి. అభిమానులు ఆగకుండా ఎదురుచూస్తున్న ఈ సినిమాపై తాజా అప్‌డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి.

ఇటీవల OG నుంచి బయటకు వచ్చిన రెండు క్రేజీ స్టిల్స్(OG Movie Stills) నెట్‌లో దుమ్మురేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ లుక్స్ గ్లింప్స్‌లో చూపించిన అవుట్‌ఫిట్స్‌లో “మామూలుగా లేవు” అనిపించేలా ఆకట్టుకున్నాయి. పవన్ లుక్ చూడగానే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ ఎమోజీలు వర్షంలా కురిపిస్తున్నారు. “ఇది నిజమైన స్టిల్‌నా? లేక ఏఐ మాయాజాలమా?” అని సందేహాలు వ్యక్తం చేసేలా ఈ స్టిల్స్ పాపులర్ అయ్యాయి. కానీ ఏది ఏమైనా పవర్ స్టార్ లేటెస్ట్ లుక్స్ మాత్రం ఫ్యాన్స్ హృదయాలను షేక్ చేశాయి.

ఇకపోతే, ఈ సినిమాకు థమన్ అందిస్తున్న సంగీతం కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ (Trans of OMI) సాంగ్ సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టించింది. ఆ జోష్ తగ్గకముందే మరో సింగిల్ ‘గన్స్ అండ్ రోజెస్’ (Guns N Roses) కూడా హై వోల్టేజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధిస్తూ ఈ పాటలు ఓజీ మ్యూజికల్ జర్నీని బ్లాక్‌బస్టర్ లెవల్‌కు తీసుకెళ్లాయి.

ప్రస్తుతం థియేటర్స్‌లో పవన్ పవర్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పవన్ లేటెస్ట్ స్టిల్స్, సాంగ్స్ కలిపి చూస్తే, ‘OG’ సినిమాతో పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి భారీ ఫీస్ట్ గ్యారెంటీ అని చెప్పడంలో సందేహం లేదు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts