సినిమా వార్తలు

మన శంకర వరప్రసాద్ గారు డైరెక్టర్ చేతుల మీదుగా ‘వాషింగ్టన్ సుందర్’ పాట

Published by
Srinivas

సత్య వినుగొండ, అనుశ్రీ, శీతల్ భట్ హీరో-హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వాషింగ్టన్ సుందర్’ విడుదలకు సిద్ధమవుతోంది. యస్‌.యస్‌. మూవీ కార్పొరేషన్ బ్యానర్‌పై బిపేట ప్రేమ్‌కుమార్ సమర్పణలో ఈ సినిమాను నిర్మించారు. సత్య వినుగొండ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని, చాలా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రానికి నందన్ రాజ్ బొబ్బిలి అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇటీవల ఈ చిత్రంలోని మొదటి పాటను సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు.

హీరో, దర్శకుడు సత్య వినుగొండ మాట్లాడుతూ — “చిన్నప్పుడు తన ఊరిని వదిలి పారిపోయిన ఒక కుర్రాడు 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ ఊరికి ఎందుకు వచ్చాడు? వచ్చిన తర్వాత ఆ ఊరికి ఏం చేశాడు? మళ్లీ హైదరాబాద్‌కి ఎందుకు వెళ్లిపోయాడు? — అనేదే మా ‘వాషింగ్టన్ సుందర్’ కథ. సినిమా మొత్తం సంతోషంగా, హాయిగా సాగుతూ, వినోదం పంచే విధంగా ఉంటుంది. నందన్ రాజ్ బొబ్బిలి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ప్రతి నటుడు తమ పాత్రకు న్యాయం చేశారు. ఇది పక్కా మాస్ టచ్ ఉన్న చక్కటి ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది,” అన్నారు.

ఈ చిత్ర బృందం: డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మధు బసిరెడ్డి మరియు శ్రీనివాస్ విన్నకోట, ఎడిటర్ మేనగ శ్రీను, కోరియోగ్రఫీ గణేష్ మాస్టర్, ఫైట్స్ నందూ, డిజిటల్ ఇంప్రూవ్‌మెంట్ (డిఐ) యమ్.బి. ప్రకాష్, మరియు 5.1 కాళీఎస్‌.ఆర్ అశోక్. సహనిర్మాతలుగా అంజయ్య దన్నారం, జీవన్ రెడ్డి పోతులూరి, మరియు నిర్మాణంలో అనిల్ కుమార్ గుజ్జరి పాల్గొన్నారు.

‘వాషింగ్టన్ సుందర్’ తన ప్రత్యేకమైన కథ, చక్కటి సంగీతం, మరియు సమర్థవంతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టే వినోదభరిత చిత్రం అవుతుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts