సినిమా వార్తలు

క్లైమాక్స్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు: వరలక్ష్మి శరత్ కుమార్

Published by
Srinivas

నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన హై-కాన్సెప్ట్ థ్రిల్లర్ చిత్రం ‘సరస్వతి’ థియేటర్లలో మంచి స్పందనతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. వరలక్ష్మి తన సోదరి పూజా శరత్ కుమార్తో కలిసి దోస డైరీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండగా, ప్రేక్షకులు అందిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపేందుకు చిత్రబృందం ప్రత్యేకంగా థాంక్యూ మీట్ నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో హీరోయిన్, దర్శకురాలు వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ ప్రేక్షకుల స్పందన తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. “నిన్న నేను చాలా థియేటర్లకు వెళ్లాను. ప్రతి సీన్‌కి, ప్రతి డైలాగ్‌కి ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ సినిమాను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ స్పందన చూసి ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రయాణంలో మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” అని తెలిపారు.

ఇది కేవలం మహిళా ప్రధాన చిత్రం మాత్రమే కాదని, పూర్తి స్థాయి థ్రిల్లర్ అని వరలక్ష్మి పేర్కొన్నారు. “ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్, లవ్ వంటి అన్ని అంశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒకసారి థియేటర్‌కి వెళ్లి ఈ సినిమాను చూడాలి. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు మంచి మెసేజ్‌లు పంపిస్తున్నారు. మీ ప్రేమకు ధన్యవాదాలు” అని అన్నారు.

నిచోలాయ్ సచ్‌దేవ్ మాట్లాడుతూ, “సరస్వతి ఒక బలమైన కథతో తెరకెక్కిన సినిమా. ఇలాంటి కథను తెరపైకి తీసుకురావడానికి ఎంతో ధైర్యం కావాలి. ఇది కేవలం మహిళల కథ మాత్రమే కాదు, ఒక మంచి థ్రిల్లర్. ఒక సినిమా ప్రేక్షకుల మనసులను కదిలిస్తే అదే నిజమైన విజయం. సరస్వతి కూడా అలాంటి సినిమానే. చిన్న సినిమా అయినప్పటికీ బలమైన కంటెంట్ ఉంది. అందరూ తప్పకుండా థియేటర్లలో చూసి ఆదరించాలి” అని అన్నారు.

నిర్మాత పూజా శరత్ కుమార్ మాట్లాడుతూ, “సరస్వతి సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. సినిమా వైరల్ కావడానికి మీరు అందించిన ప్రోత్సాహం చాలా ముఖ్యమైనది. ఇప్పటివరకు సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి అభిప్రాయాలు చెబుతున్నారు. మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ మంది థియేటర్లలో ఈ సినిమాను చూసి మాకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts