Download App

చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జెండా ఆవిష్కరించిన మెగాస్టార్

ఆగస్ట్ 15, 2025 By Rahul N
దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా వందన కార్యక్రమంలో అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్, సుస్మిత, అలాగే మెగా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో...
చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జెండా ఆవిష్కరించిన మెగాస్టార్

దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

జెండా వందన కార్యక్రమంలో అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్, సుస్మిత, అలాగే మెగా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి.

ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “ప్రతి భారతీయుడికి 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మన పూర్వీకులు సాధించిన ఈ విలువైన స్వాతంత్ర్యాన్ని ఆనందంగా జరుపుకుందాం. ఈ స్వేచ్ఛ మన ప్రతిభ, అభివృద్ధికి బలాన్ని ఇచ్చి, మన దేశం ఎప్పటికీ ముందుకు సాగడానికి దోహదం చేయాలి. జై హింద్” అని సందేశం ఇచ్చారు.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading