SAAP కార్యాలయం వద్ద ఉద్రిక్తత… ‘మాపై దాడికి వైసీపీ కుట్ర’.. స్పోర్ట్స్ కోటా టీచర్ల ఆరోపణ
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా నియామకాల వ్యవహారం మరోసారి రాజకీయ వివాదానికి దారితీసింది. స్పోర్ట్స్ కోటా ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ నేతలు విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అదే సమయంలో తమ నియామకాలు నిబంధనల ప్రకారమే జరిగాయని చెబుతూ స్పోర్ట్స్ కోటా టీచర్లు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. క్రీడా ప్రతిభతో ఉద్యోగాలు సాధించామని టీచర్ల వెల్లడి […]
Read Moreమెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. జగన్‌పై క్రీడాకారుల ఫైర్
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై కొనసాగుతున్న రాజకీయ వివాదం మరింత ముదురుతోంది. తమను ‘ఫేక్’ క్రీడాకారులుగా చిత్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నారంటూ స్పోర్ట్స్ కోటా ద్వారా టీచర్ ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులు తీవ్రంగా స్పందించారు. ఈ అంశంపై విజయవాడలో ఆదివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో దాదాపు 370 మంది స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు పాల్గొని తమ వాదనలను వెల్లడించారు. ‘కెనడాలో సాఫ్ట్‌బాల్ వరల్డ్ కప్ ఆడా.. నన్ను ఫేక్ అంటారా?’ స్పోర్ట్స్ కోటా […]
Read Moreడీఎస్సీపై ‘సాక్షి’ ప్రచారానికి రామకృష్ణ కౌంటర్..
డీఎస్సీ నియామకాలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. తనను అడ్డం పెట్టుకుని ‘సాక్షి’లో తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ రామకృష్ణ అనే అభ్యర్థి పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తాను డీఎస్సీలో క్వాలిఫై కాలేదని, ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నానని పేర్కొన్నారు. డీఎస్సీలో అర్హత సాధించకపోయినా తనకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వచ్చిందంటూ ‘సాక్షి’లో ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవమని ఆయన ఖండించారు. తన వ్యక్తిగత […]
Read More‘ఇంటింటికీ తెలుగుదేశం-2026’: మరో చారిత్రక మైలురాయి.. కోటికి పైగా ఇళ్లకు చేరిన టీడీపీ పార్టీ శ్రేణులు
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించడంతో పాటు.. వారి సమస్యలు, అవసరాలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకునే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం-2026’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే కోటికి పైగా ఇళ్లను పార్టీ నాయకులు, కార్యకర్తలు సందర్శించడం టీడీపీ రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ […]
Read Moreకాకినాడ జీజీహెచ్‌లో రూ.36.6 కోట్లతో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం.. పవన్ కళ్యాణ్ కృషికి ఫలితం
కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో అత్యాధునిక క్యాన్సర్ చికిత్సా కేంద్రం ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో రూ.36.6 కోట్ల విలువైన డ్యూయల్ ఎనర్జీ లీనియర్ యాక్సిలేటర్ (LINAC) యంత్రం మంజూరైంది. ఒఎన్‌జీసీ సీఎస్‌ఆర్ నిధుల ద్వారా ఈ అత్యాధునిక పరికరాన్ని సమకూర్చేందుకు చర్యలు చేపట్టారు. క్యాన్సర్ రోగులకు ఆధునిక వైద్యం అందించడమే లక్ష్యంగా జీజీహెచ్‌లో రేడియోథెరపీ విభాగాన్ని మరింత బలోపేతం చేయనున్నారు. […]
Read Moreదళవాయి రమాదేవి: టీడీపీలో కష్టానికి గుర్తింపు.. బీసీ, దళిత నాయకత్వానికి ప్రాధాన్యత
తెలుగుదేశం పార్టీలో క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు, నాయకులకు తగిన గుర్తింపు లభిస్తుందనే సందేశాన్ని దళవాయి రమాదేవి ఎంపిక మరోసారి స్పష్టం చేస్తోంది. పదవుల కోసం లాబీయింగ్, సిఫార్సుల కంటే పార్టీ కోసం చేసిన కష్టానికే ప్రాధాన్యత ఇస్తున్నామనే సంకేతాన్ని ఈ నిర్ణయం ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనంతపురం జిల్లాకు చెందిన దళవాయి రమాదేవి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న బీసీ మహిళా నాయకురాలు. డ్వాక్రా సంఘం అధ్యక్షురాలిగా, టీడీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌గా ఆమె పార్టీ కోసం […]
Read Moreఇండోనేషియాలో భారీ భూకంపం.. 7.7 తీవ్రత, సునామీ హెచ్చరికలు జారీ
ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపం శనివారం తెల్లవారుజామున భారీ భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. భూకంపం ప్రభావంతో తూర్పు నుసా తెంగారా ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. USGS వివరాల ప్రకారం.. భూకంపం దాదాపు గంటన్నర వ్యవధిలో ఐదుసార్లు భూప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. వరుసగా ప్రకంపనలు చోటుచేసుకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలువురు భయంతో ఇళ్ల నుంచి […]
Read Moreసీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట.. అసైన్డ్ భూముల కేసు కొట్టివేత
అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించిన కేసులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో కీలక ఊరట లభించింది. వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. దాన్ని కొట్టివేసింది. ఈ కేసును పూర్తిగా రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఏపీ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం గానీ, అందుకు తగిన కారణాలు గానీ కనిపించడం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం […]
Read Moreప్రియాంక కుటుంబానికి జీఎస్ఎల్ కాలేజీ అండ.. రూ.20 లక్షల సాయం
రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడంతో తీవ్ర విషాదంలో ఉన్న ఆమె కుటుంబానికి రాజమండ్రి జీఎస్ఎల్ వైద్య కళాశాల యాజమాన్యం అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి తమ మానవత్వాన్ని చాటుకుంది. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్ల్‌సపూర్‌లోని ప్రియాంక ఇంటికి కళాశాల యజమాని కుమారుడు తరుణ్, ఆయన భార్య సాధ్విక, ప్రిన్సిపాల్ సుభాషిణి బుధవారం వెళ్లారు. ప్రియాంక తండ్రి వెంకటేశ్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి […]
Read Moreతెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. ఆగస్టు 15 నుంచి పంపిణీ
తెలంగాణ ప్రభుత్వం ఆహార భద్రత వ్యవస్థలో మరో కీలక అడుగు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఆగస్టు 15న శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, అదే రోజున రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ఏకకాలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ […]
Read More