సినిమా వార్తలు

డిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్

Published by
Rahul N

మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పేరు, ఫోటోలు, వీడియోలు, ముఖ్యంగా డీప్‌ఫేక్‌ల రూపంలో బయటపడుతున్న తప్పుడు కంటెంట్‌ నుంచి రక్షించుకోవడానికి ఆయన న్యాయపరమైన మార్గాన్ని ఆశ్రయించారు. ఎన్టీఆర్ తరఫున న్యాయవాది జె. సాయి దీప్‌క్ డిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇటీవల సోషల్ మీడియాలో నటుల వ్యక్తిత్వాన్ని వక్రీకరించేలా తయారవుతున్న వీడియోలు, అనధికారికంగా వారి పేరునే వాడుకుని వ్యాపారం చేసే అక్రమ చర్యలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తీసుకున్న అడుగు పరిశ్రమ మొత్తంలో చర్చనీయాంశమైంది.

పిటిషన్‌పై స్పందించిన డిల్లీ హైకోర్టు, సోషల్ మీడియా కంపెనీలు మూడు రోజుల్లోగా తమ సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. ఐటీ రూల్స్–2021 ప్రకారం అన్ని సంస్థలు కచ్చితంగా వ్యవహరించాలనేదే కోర్టు స్పష్టం. ఈ కేసులో తదుపరి విచారణ డిసెంబర్ 22న జరగనుంది.

తాజాగా నాగార్జున, చిరంజీవి, మోహన్‌బాబు వంటి సీనియర్ నటులు కూడా ఇలాంటి న్యాయపరమైన రక్షణ కోసం ముందడుగు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ జాబితాలో చేరడంతో టాలీవుడ్‌లో వ్యక్తిత్వహక్కుల పట్ల అవగాహన మరింతగా పెరుగుతోందని సినీ వర్గాల అభిప్రాయం. త్వరలోనే మరికొంత మంది స్టార్‌లు కూడా ఇలాంటి రక్షణ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న యాక్షన్ డ్రామా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Rahul N

Recent Posts

  • ఓటిటి న్యూస్

‘పల్లబురుసు’.. ఓటీటీ స్ట్రీమింగ్!

సెప్టెంబర్ 3, 2026