బండ్ల గణేష్, ఇటీవల సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉన్నారు. ముఖ్యంగా ట్విటర్ ద్వారా సెలెబ్రిటీలకు విషెస్ చెబుతూ ఉండే గణేష్.. ఇప్పుడు మౌళిపై పెట్టిన ఓ పోస్ట్‌తో ఇప్పుడు వార్తల్లో నిలిచారు.
యూట్యూబ్ ద్వారా కామెడీ కంటెంట్‌తో యూత్‌ను ఆకట్టుకున్న మౌళి తనూజ్ , ‘#90స్’ వెబ్ సిరీస్ ద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో హీరోగా తెరపైకి వచ్చాడు. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ సినిమా కి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ రాబడుతోంది. తొలిరోజే బ్రేక్ ఈవెన్ సాధించిందన్న వార్తలతో, మౌళిపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు..
బండ్ల మౌళిని మెచ్చుకుంటూ… తన పోస్ట్‌లో.. “కొడితే నీలా కొట్టాలిరా బాబు దెబ్బ.. చంపేసావు.. ఇక దున్నేయ్ టాలీవుడ్ నీదే” అని చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.
అయితే ఈ పోస్ట్ పై అసలు విషయాన్నీ పక్కన పెట్టి, అన్నా నువ్వు OG ప్రీ రిలీజ్ కి రా… OG ఈవెంట్ పగిలిపోవాలి.. ప్లీజ్ రా అన్నా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
పవన్ కళ్యాణ్ ఓజి చిత్రం ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ సేల్స్ లో అమెరికాలో రికార్డులు బద్దలు కొడుతోంది.
మరి ఫాన్స్ రిక్వెస్ట్ స్వీకరించి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి బండ్ల వస్తాడో వేచి చూడాల్సిందే..