కేరళకు చెందిన ప్రముఖ నటి నవ్య నాయర్‌కు ఆస్ట్రేలియాలో అనుకోని చేదు అనుభవం ఎదురైంది. ఓ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వెళ్లిన ఆమెను మెల్‌బోర్న్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ఆపి, మల్లెపూలు తీసుకెళ్లినందుకు భారీ జరిమానా విధించారు.
ఏం జరిగింది?
మలయాళీలకు ఓనం పండగ ఎంత ప్రత్యేకతో అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా నిర్వహించిన ఓనం వేడుకలకు అతిథిగా నవ్య నాయర్ వెళ్లారు. అయితే, తన బ్యాగ్‌లో మల్లెపూలు ఉన్నాయని గుర్తించిన అధికారులు ఆమెకు ఏకంగా రూ.1.14 లక్షల జరిమానా విధించారు.
నవ్య నాయర్ వివరణ
ఈ సంఘటనపై నవ్య నాయర్ ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ – “ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు నా కోసం నాన్న మల్లెపూలు కొని తెచ్చారు. వాటిలో కొన్నింటిని జుట్టులో పెట్టుకున్నాను, మరికొన్నింటిని బ్యాగ్‌లో పెట్టుకున్నాను. ఇది నిబంధనలకు విరుద్ధమని నాకు తెలియదు. ఉద్దేశపూర్వకంగా కాకుండా పొరపాటున జరిగింది” అని వివరించారు. అదే సమయంలో, అధికారులు తనకు 28 రోజుల్లోపు జరిమానా చెల్లించాలని చెప్పినట్లు ఆమె వెల్లడించారు.
సోషల్ మీడియాలో హాట్ టాపిక్
ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఓనం పండుగ సందర్బంగా మల్లెపూలు తీసుకెళ్లినందుకు నటి ఇంత భారీ ఫైన్ చెల్లించాల్సి రావడం సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.