సినిమా వార్తలు

OGలో అకీరా నందన్.. ఆ కిక్కే వేరప్పా!

Published by
Srinivas

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం OG రిలీజ్ కి దగ్గరపడుతోంది. అంతేకాదు రోజురోజుకీ మరింత హైప్ పెరుగుతోంది. తాజాగా వచ్చిన ఫైర్ స్టార్మ్ తో థమన్ పవన్ ఫాన్స్ కి పెద్ద బూస్ట్ ఇచ్చాడు. దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రతి అప్‌డేట్‌ అభిమానుల్లో హైప్‌ను పెంచుతోంది. తాజాగా, సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర టాక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల రిలీజ్ అయిన ఫైర్ స్టార్మ్ సాంగ్ లోని కొన్ని విజువల్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఫ్యాన్స్, పవన్ కల్యాణ్ వారసుడు అకీరా నందన్ ఈ సినిమాలో కనిపిస్తారా? అనే ఊహాగానాలు మొదలు పెట్టారు. అదీ కాక, సినిమాలో ఓ ప్రత్యేక క్యామియో ఉందని, అది అకీరానే అని చెప్పే వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి.

ఫిలిం నగర్ సమాచారం ప్రకారం, OG లో పవన్ కల్యాణ్ మూడు వేర్వేరు దశల్లో సినిమా స్క్రీన్‌పై కనిపించనుండొచ్చునని, అందులో యంగ్ ఏజ్ లుక్ కూడా ఒకటి. ఈ లుక్ కోసం అకీరా నటిస్తే, అది నిజంగా థియేటర్లలో గ్రాండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ వార్తపై ఇంకా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. కొందరు దీన్ని కేవలం రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేయగా, మరికొందరు నిజం అని నమ్ముతున్నారు.

ఏదేమైనా, అకీరా నందన్ ఓజిలో కనిపిస్తే ఆ కిక్కే వేరప్పా !

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts