ప్రభాస్–అనుష్క హిట్ పెయిర్ ని వెండితెరపై చూసి చాలా ఏళ్లు అయింది. బాహుబలి 2 తర్వాత ఈ జంట కలిసి కనిపించే అవకాశమే దొరకలేదు. ఇటీవల జరిగిన బాహుబలి రీయూనియన్ కు కూడా అనుష్క రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే ఇప్పుడు ఆ గ్యాప్‌కు ఎండ్ కార్డ్ పడబోతోంది.
దర్శకధీరుడు రాజమౌళి ప్లాన్ ప్రకారం, బాహుబలి – ది బిగినింగ్ మరియు బాహుబలి – ది కన్క్లూజన్ రెండింటినీ కలిపి, ఒకే సినిమాగా “బాహుబలి – ది ఎపిక్” పేరిట అక్టోబర్‌లో గ్రాండ్ రీ-రిలీజ్ చేయబోతున్నారు. దీనికి ప్రత్యేక ప్రచారం కూడా నిర్వహించనున్నారు.
ప్రచార కార్యక్రమాల్లో భాగంగా, ప్రభాస్–రానా కలిసి ఓ చిట్‌చాట్ ప్రోగ్రామ్ కూడా రికార్డ్ చేశారు. ఇది అభిమానుల్లో మంచి హంగామా క్రియేట్ చేసింది.
అందరినీ ఎక్కువ ఎగ్జైట్ చేస్తున్న విషయం ఏమిటంటే – ప్రభాస్–అనుష్క జంట మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారు. ఈ రీ-రిలీజ్ కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొనడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత ఈ జంట స్క్రీన్‌పై కనిపించబోతున్నారని తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రెండు భాగాలుగా సినిమా రిలీజ్ చేసి ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త ట్రెండ్ సృష్టించిన రాజమౌళి, ఇప్పుడు రీ-రిలీజ్ ఫార్మాట్ తో మరో సరికొత్త ట్రెండ్ సృష్టించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఎట్టకేలకు ప్రభాస్–అనుష్క ఒకే వేదికపై కలిసి బాహుబలి – ది ఎపిక్ కు ప్రమోషన్ చేయబోతున్నారన్న వార్త, అభిమానుల్లో ఇప్పటికే హైప్ పెంచేసింది. ఈ రీ-రిలీజ్ కూడా ఒక మెయిన్ స్ట్రీమ్ రిలీజ్ లాగే భారీ స్థాయిలో జరగనుంది.