సినిమా వార్తలు

‘కల్కి 2’ అప్‌డేట్: అప్పుడే కాదు

Published by
Srinivas

రెబెల్ స్టార్ ప్రభాస్ కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టించిందో చెప్పనవసరం లేదనుకుంటా… ఈ విజయం తరువాత సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ దీపికా పడుకోన్ ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ – మైథాలజీ మేళవింపుతో వచ్చిన ‘కల్కి 2898 ఏడి’ 2024 జూన్‌లో విడుదలైంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

కల్కి మూవీని 2 భాగాలుగా చేసిన సంగతి తెలిసిందే. ముందుగా అనుకున్న ప్రకారం కల్కి 2 షూటింగ్ 2025 చివరి నాటికి ప్రారంభం అవ్వాల్సి ఉండగా, ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.

దర్శకుడు నాగ్ అశ్విన్ మాటల్లో… “2025 చివర్లో షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నాం. కానీ చాలా విషయాలు దీనికి ముడిపడి ఉన్నాయి. అందరూ నటులు ఒకేసారి అందుబాటులో ఉండాలి, ఈసారి ముందుగానే ప్రీ-విజువలైజ్ చేసిన సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు చాలా పెద్దవి, కాబట్టి సమయం పడుతుంది. ఖచ్చితమైన సమాధానం ఇప్పుడే చెప్పలేను. అందరూ బిజీగా ఉన్నారు,” అని ఆయన వివరించారు.

ఇక షూటింగ్ ఈ సంవత్సరం ఎండింగ్లో ప్రారంభమైనా కూడా పోస్ట్-ప్రొడక్షన్‌కి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. “ఇంకా రెండేళ్లు లేదా మూడేళ్లు పడుతుందని అనుకుంటున్నాను,” అని ఆయన అన్నారు.

దీన్ని బట్టి చూస్తే, ప్రభాస్ అభిమానులు ఇంకొంత కాలం వేచి చూడక తప్పదు మరి కల్కి 2 కోసం.

కల్కి 2898 ఏడి లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించగా, సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts