సినిమా వార్తలు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిసిన రామ్ చరణ్

Published by
Rahul N

భారీ అంచనాల నడుమ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఫస్ట్ షాట్ తో అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించారు. ప్రస్తుతం మైసూరులో ఒక గ్రాండ్ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు.

ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యేక ఆహ్వానం మేరకు రామ్ చరణ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని శాలువాతో సత్కరించారు.

సమావేశంలో రామ్ చరణ్, పెద్ది సినిమా గురించి ముఖ్యమంత్రికి కొన్ని విశేషాలను తెలియజేశారు. సినీ రంగానికి సంబంధించిన విషయాలు కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చాయి.

భారీ స్థాయిలో సాంగ్ షూట్

మైసూరులో ప్రస్తుతం జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక మెగా సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. సుమారు 1000 మందికి పైగా డాన్సర్లతో ఈ పాటను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. మేకర్స్ ఈ సాంగ్‌ను సినిమాకు హైలైట్‌గా నిలిపేలా బిగ్ స్కేల్‌లో ప్లాన్ చేస్తున్నారు.

ప్రతిష్టాత్మక నిర్మాణం

పెద్ది సినిమాను బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి.

Rahul N

Recent Posts